Intinti Gruhalakshmi 5 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 మే 2022, గురువారం ఎపిసోడ్ 624 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి జాగింగ్ డ్రెస్ వేసుకోవడం చూసి పరందామయ్య, అనసూయ అందరూ షాక్ అవుతారు. నీలో వచ్చిన ఈ మార్పును చూసి చాలా ఆనందంగా ఉంది అంటాడు పరందామయ్య. దీంతో ఈ మార్పుకు కారణం ప్రవళిక అని చెబుతుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా.. నీకు నచ్చినట్టు ఉండు అని అనసూయ చెబుతుంది. ఒక్క పది నిమిషాలు ఉండండి.. ఇప్పుడే టిఫిన్ తయారు చేస్తాను అంటుంది. ఇంతలో కాలేజీకి వెళ్తూ దివ్య.. రేపు ల్యాబ్ కు 20 వేలు కట్టాలి. మరిచిపోకు అని చెబుతుంది. దీంతో డబ్బులు ఎలా కట్టాలో తులసికి అర్థం కాదు.
మరోవైపు లాస్య, నందు ఇద్దరూ తులసి మాట్లాడిన తీరు గురించే ఊహించుకుంటూ ఉంటారు. నందుకు ఎనలేని కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. తులసితో మాట అనిపించుకున్న నాకు ఇరిటేటింగ్ గా ఉంది అంటుంది లాస్య. దీంతో నిన్నే కాదు.. నన్ను కూడా అన్నది కదా అంటాడు నందు. నువ్వెప్పుడైనా నా డ్రెస్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యావా అంటుంది. ఇది బాగుంది.. అది బాగుంది.. అది వేసుకోవద్దు అని ఎప్పుడైనా కామెంట్ చేశావా అని అడుగుతుంది. దీంతో చెయ్యలేదు అని అంటాడు. పెళ్లాం అయిన నా డ్రెస్ విషయంలోనే నువ్వు ఏనాడూ పట్టించుకోలేదు.. తులసి డ్రెస్ విషయంలో మాత్రం నువ్వెందుకు పట్టించుకోవాలి. ఎందుకు తనను అడిగావు అని అంటుంది లాస్య. దీంతో అక్కడ మా అమ్మానాన్న ఉన్నారు. దివ్యకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి. అప్పటి వరకు నేను తులసిని పట్టించుకుంటూనే ఉంటాను అని అంటాడు నందు.
మరోవైపు దివ్యకు ల్యాబ్ ఫీజు ఎలా కట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది తులసి. ఇంతలో పరందామయ్య, అనసూయ వస్తారు. ఇప్పుడు ఎలా డబ్బులు సంపాదిస్తావమ్మా. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేవు అని అంటాడు పరందామయ్య. ఫ్యాక్టరీ కూడా మానేశావు అంటాడు.
దీంతో ఇంటి ఖర్చుల గురించి మీరు ఆలోచించకండి. నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. ఆ తర్వాత ప్రవళికను కలుస్తుంది తులసి. ఇద్దరూ కలిసి రెస్టారెంట్ లో కూర్చుంటారు. సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ప్రవళిక కానీ.. తులసి మాత్రం దీనంగా కనిపిస్తుంది.
దీంతో ఏమైంది అని అడుగుతుంది ప్రవళిక. ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. కష్టం చెప్పుకుంటూ ఉంటే మనసుకు బాధగానే ఉంటుంది. కానీ.. అలా చెప్పుకోకపోతే ఆ బాధ గుండెలోనే పేరుకుపోయి బరువెక్కుతుంది అంటుంది ప్రవళిక.
దీంతో ఫ్యాక్టరీ గురించే అంటుంది. ఫ్యాక్టరీ వదిలేశాను కదా అంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయా అని అడుగుతుంది. దీంతో ఈ నెల వరకు ఓకే కానీ.. వచ్చే నెల నుంచి డబ్బులకు ఇబ్బంది రావచ్చు అంటుంది. పోనీ.. ఏదైనా ఉద్యోగం చూడమంటావా అంటుంది ప్రవళిక.
నాకు డిగ్రీ లేదు ఏం లేదు.. ఎవరు ఇస్తారు జాబ్. అందుకే కదా.. మా ఆయన ముందు లోకువ అయింది అంటుంది తులసి. సరే అయితే.. నీకు తెలిసిన పని చేయి. మళ్లీ పాటలు పాడటం స్టార్ట్ చేయి అంటుంది ప్రవళిక. నువ్వు చక్కగా పాటలు పాడటం నేర్చుకున్నావు కదా అంటుంది ప్రవళిక.
దీంతో అదంతా గతం అంటుంది తులసి. మీ అమ్మను తలుచుకొని పాటలు పాడటం మొదలు పెట్టు అని తులసిని మోటివేట్ చేస్తుంది ప్రవళిక. దీంతో తులసి ఆలోచనలో పడుతుంది. ఇష్టపడ్డ పనే బతుకుతెరువు అయితే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది అని అంటుంది ప్రవళిక.
కట్ చేస్తే అంకిత.. తులసిని చూడటానికి తన ఇంటికి వస్తుంది. ఎలా ఉన్నారు ఆంటి అని అడుగుతుంది. అభి ఏం చేస్తున్నాడు. వాడికి ఈ అమ్మ గుర్తొస్తుందా అని అడుగుతుంది తులసి. ఖచ్చితంగా మీరు అభికి గుర్తొస్తారు ఆంటి. కానీ.. నాకు చెప్పుకోడు అంటుంది అంకిత.
మీ అమ్మ గారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడుగుతుంది తులసి. దీంతో నేను వచ్చింది మీ గురించి తెలుసుకోవడానికి అంటుంది అంకిత. నా గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది అంకిత.. అన్నింటికీ సర్దుకొని పోయే పరిస్థితి నాది అంటుంది తులసి.
మీ గురించి ఆలోచించే బాధ్యత అభికి ఉంది కదా అంటుంది అంకిత. ఆ తర్వాత కొంత డబ్బును అంకిత తులసికి ఇవ్వబోతుంది. తీసుకోండి అంటుంది. ఈ ఇంటి కోడలుగా నేనూ బాధ్యత పంచుకోవాలనుకుంటున్నాను. మీరు మరోలా అనుకోవద్దు. నామీద కోపం తెచ్చుకోవద్దు. అర్థం చేసుకోండి ప్లీజ్ అని డబ్బులు తీసుకోండి అంటుంది అంకిత.
దీంతో ఆ డబ్బులను తీసుకొని తన బ్యాగ్ లోనే పెడుతుంది తులసి. నువ్వు ఈ ఇంటి కోడలువే కావచ్చు. ప్రస్తుతం ఆ ఇంటి బిడ్డగా మీ పుట్టింట్లో ఉంటున్నావు. నువ్వు ఏ పని చేసినా వాళ్లకు చెప్పి చేయాలి. పర్మిషన్ తీసుకొని చేయాలి అంటుంది తులసి.
దీంతో ఆ విషయం నాకు అవసరం లేదు అంటుంది. ఇలా డబ్బులు నువ్వు ఇవ్వడం తప్పు అంటుంది. అంత చేతగాని పరిస్థితి వస్తే నేను నీకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతాను. సరేనా.. రాకరాకవచ్చావు. నీకు ఇష్టమైన ఉప్మా పెసరట్టు చేసి పెడతానురా అని లోపలికి పిలుస్తుంది తులసి.
కట్ చేస్తే.. అభి ఆసుపత్రికి బయలుదేరుతాడు. గాయత్రి వచ్చి అభి అని పిలుస్తుంది. ఏంటి అభి హాస్పిటల్ కా అంటుంది. దీంతో అవును అంటాడు. అంకిత ఎక్కడుంది అని అడుగుతుంది. తను బయటికి వెళ్లిపోయినట్టుంది అంటాడు.
దీంతో నేను ఈరోజు హాస్పిటల్ కు రావడం లేదు. ఏదైనా అవసరం అయితే కాల్ చేయమను అంటుంది. ఇంతలో అభి మరిచిపోయాను.. ఈ డబ్బులు తీసుకో. ఇవి నీ దగ్గర ఉంచు. ఖర్చులకు పనికివస్తాయి అంటుంది. దీంతో పర్లేదు ఆంటి అంటాడు.
కానీ.. ఏం కాదులే.. తీసుకో.. అంటుంది గాయత్రి. ఇవన్నీ అంకిత పక్కనుంచి వింటూ ఉంటుంది. నిజానికి బాగా కష్టాల్లో ఉన్నాను. డబ్బులు చాలా అవసరం ఉన్నాయి అని అంటాడు అభి. ఆ డబ్బులు తీసుకుంటాడు. గాయత్రి లోపలికి వెళ్లాక.. చాలా బాగుంది అభి అంటుంది అంకిత.
నువ్వు ఎదిగావని అనుకుంటున్నావేమో.. నువ్వు పాతాళానికి పడిపోయావు అంటుంది అంకిత. ఎప్పుడైతే నువ్వు మన ఇంటి గడప దాటావో ఆరోజే అన్నీ నువ్వు వదిలేసుకున్నావు. తను తులసి ఇంటికి వెళ్లిన విషయం గురించి అంకిత.. అభికి చెబుతుంది.
అది నీకు, ఆంటికి ఉన్న తేడా అంటుంది అంకిత. ఇంకెప్పుడు నువ్వు ఆంటిలా మారుతావు అని అడుగుతుంది అంకిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.