Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : అక్షరతో ప్రేమ్ పెళ్లి ఫిక్స్ చేసిన నందు.. షాక్ అయిన శృతి, తులసి.. పెళ్లిచూపులు కూడా అరేంజ్ చేసిన నందు? శృతిని కాదని అక్షరను ప్రేమ్ పెళ్లి చేసుకుంటాడా?

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417
Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రతి రోజు ప్రసారం కాదు. సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. ఆదివారం ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇప్పటి వరకు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 416 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ శనివారంతో 416 ఎపిసోడ్ పూర్తయింది.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417
సోమవారం.. అంటే 6 సెప్టెంబర్ 2021 నాడు 417 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే.. శనివారం ప్రసారమైన ఎపిసోడ్ ను చూశారు కదా. నందుకు బంపర్ ఆఫర్ ఇస్తాడు జీకే. తన కంపెనీ అప్పుల నుంచి గట్టెక్కాలంటే.. ప్రేమ పెళ్లిన అక్షరతో జరిపించాలని చెబుతాడు.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417
దీనికి నందు ఒప్పుకోవడానికి సందేహించినప్పటికీ.. లాస్య ఉండి.. వెంటనే ఓకే చెప్పేస్తుంది. దీంతో జీకే సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జీకే ఇంటికి వెళ్లగానే.. తన కూతురు అక్షర పిలిచి.. ఏమైంది డాడీ.. ప్రేమ్ వాళ్ల నాన్నతో మాట్లాడారా? ఏమన్నారు.. పెళ్లికి ఒప్పుకున్నారా? అని అడుగుతుంది.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417
Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : అక్షరకు మాటిచ్చిన జీకే
నేను వెళ్లాక ఒప్పుకోకుండా ఉంటారా? నీ పెళ్లి ఖచ్చితంగా ప్రేమ్ తోనే. నువ్వు అడిగింది.. నేను ఏనాడైనా కాదన్నానా? అని అంటాడు జీకే. మొత్తానికి అక్షర సంతోషంగా తన రూమ్ లోకి వెళ్తుంది. ప్రేమ్ నెంబర్ ను కూడా తన డాడీ దగ్గర్నుంచి తీసుకుంటుంది.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417
కట్ చేస్తే.. తులసి దగ్గరికి వెళ్లిన లాస్య.. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నీ చిన్నకొడుకు ప్రేమ్ కు నందు.. పెళ్లి సంబంధం చూశాడు. ఆషామాషీ సంబంధం కాదు అది. కోటీశ్వరుల సంబంధం. ఎన్ని జన్మలు ఎత్తినా ప్రేమ్ కు ఇటువంటి సంబంధం దొరకదు.. అంటూ చెబుతుంది లాస్య. దీంతో.. ప్రేమ్ కు ఎవరిని పెళ్లి చేసుకోవాలో… వాడికి బాగా తెలుసు.. వాడికి మీరెవరూ సంబంధాలు చూడాల్సిన అవసరం లేదంటుంది తులసి. అయినా.. వాడి పెళ్లి మీద మీకు ఎందుకు అంత శ్రద్ధ. మీ బిజినెస్ కోసం వాడిని వాడుకోవాలని చూస్తున్నారా? అని అడుగుతుంది లాస్యను.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417
Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : తులసికి ప్రేమ్, అక్షర పెళ్లి గురించి చెప్పిన లాస్య
దీంతో వావ్.. సూపర్బ్ గా కనిపెట్టావు.. కరెక్ట్ గా చెప్పావు.. అలా ఎలా చెప్పావు.. అవును.. మా బిజినెస్ కోసమే ప్రేమ్ ను వాడుకుంటున్నాం. వాడుకుంటాం కూడా. కానీ.. ప్రేమ్ కు మంచి సంబంధం తీసుకొచ్చాం.. అని చెబుతుంది లాస్య. నందు కంపెనీ నిలబడాలంటే.. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాల్సిందే. లేదంటే.. నందు ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. అందరినీ బాధపెట్టే నిర్ణయం నందు తీసుకుంటే అప్పుడు నీకు సంతోషమా? అని చెప్పి లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417
Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : ప్రేమ్ ను పెళ్లికి ఎలా ఒప్పించాలా అని ఆలోచించిన నందు, లాస్య
ఆ తర్వాత లాస్య, నందు.. ఇద్దరూ ప్రేమ్ ను ఎలా ఈ పెళ్లికి ఒప్పించాలా? అని ఆలోచిస్తుంటారు. ఇంతలో లాస్య.. శృతి విషయం చెబుతుంది. శృతిని ప్రేమ్ లవ్ చేయడం ఏంటి? ఇప్పటికే విడాకులు అయి ఒంటరిగా ఉంటున్న అనాథను ప్రేమ్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు.. ప్రేమ్ ఆ అమ్మాయిని చేసుకోవడం నేను ఒప్పుకోను. తనను చేసుకుంటే ఏం వస్తుంది. ఏం రాదు. అదే.. అక్షరను చేసుకుంటే.. ప్రేమ్ కు మంచి లైఫ్ ఉంటుంది.. అందుకే.. ప్రేమ్ శృతిని పెళ్లి చేసుకోకుండా.. అక్షరను పెళ్లి చేసుకునేలా నేను ఒప్పిస్తా.. అని లాస్యకు చెబుతాడు నందు.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417
Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : ప్రేమ్ పెళ్లి గురించి అందరికీ చెప్పిన నంద గోపాల్
కట్ చేస్తే.. తన ఫ్యామిలీ మెంబర్స్ ను అందరినీ పిలిచి.. ప్రేమ్ కు పెళ్లి సంబంధం చూశానని చెబుతాడు. జీకే ఇండస్ట్రీస్ అధినేత జీకే గారు నన్ను ఈరోజు కలిశారు. ఆయనకు ఒక కూతురు ఉంది. పేరు అక్షర. తను ప్రేమ్ ను ఇష్టపడింది. ప్రేమ్ నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. అందుకే.. ప్రేమ్ ను తనకు ఇచ్చి పెళ్లి చేద్దాం.. అని తన తండ్రికి చెబుతాడు నందు.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417
ఆ తర్వాత జీకే ఫోన్ చేసి… పెళ్లి చూపులకు వస్తున్నాం.. అని చెబుతాడు నందుకు. దీంత ఏం పర్లేదు రండి.. మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం.. అని చెబుతాడు. దీంతో ప్రేమ్ తో పాటు.. అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది. ప్రేమ్.. ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా? తులసి ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే.. తరువాయిభాగంలో చూడాల్సిందే.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417