Intinti Gruhalakshmi 8 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 8 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 445 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అక్షర ఒత్తిడి చేయడంతో అందరి ముందు శృతికి ప్రపోజ్ చేస్తాడు ప్రేమ్. దీంతో శృతి ఆగలేకపోతుంది. శృతి ప్లేస్ లో నేను ఉంటే వెంటనే ఒప్పుకునేదాన్ని అని అంటుంది అక్షర. తర్వాత శృతి గురించి తన తల్లి తులసితో డిస్కస్ చేస్తుంటాడు ప్రేమ్. శృతి నీ భార్యే.. తనే నీ భార్య అని గట్టిగా మనసులో అనుకో.. అని అంటుండగానే అక్షర అక్కడికి వస్తుంది.ఏంటి ఆంటి.. ఏదో భార్య అంటున్నారు.. అనగానే అదేనమ్మా.. రేపు పెళ్లి కదా.. దాని గురించే మాట్లాడుతున్నా.. అంటుంది తులసి.
అవును.. ఆంటి నాకు కూడా ప్రేమ్ మీద కొంచెం డౌట్ ఉంది. ప్రేమ్ సరిగ్గా నన్ను పట్టించుకోవడం లేదు. తను ప్రేమించిన అమ్మాయినే తలుచుకుంటున్నాడు. ఒకవేళ తను ప్రేమించిన అమ్మాయే కావాలంటే నన్ను వదిలేసి.. ఆమె దగ్గరికి వెళ్తావా.. అంటూ చమత్కారం చేస్తుంది అక్షర. దీంతో ప్రేమ్, తులసి షాక్ అవుతారు. ఏదో జోక్ చేశాను.. పెళ్లికాకముందు నుంచే నువ్వు నా భర్తవి అని ఫిక్స్ అయిపోయా.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అక్షర. ఇంతలో శృతితో మాట్లాడాలని నందు పిలుస్తాడు. ఏంటి అంకుల్ పిలిచారు అనగానే.. నీతో మాట్లాడాలి శృతి. నువ్వు నాకు ఇంకో సాయం చేయాలి అంటాడు. ఇంకా నేను ఇవ్వాల్సింది ఇంకేముంది అంకుల్.. అనగానే నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అంటాడు నందు.
మీరు నన్ను అర్థం చేసుకోలేదు అంకుల్.. అంటుంది. అలా అనకు శృతి.. నీ మీద నా కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉంది. నా కోసం, నా మాట కోసం నువ్వు నీ ప్రేమను త్యాగం చేశావు. నువ్వు నీ ప్రేమను త్యాగం చేసి ఉండకపోతే.. ప్రేమ్ పెళ్లి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. నాకోసం నువ్వు అందరి ముందు ప్రేమ్ అంటే ఇష్టం లేదని చెప్పావు.. అని నందు చెబుతుండగా తులసి విని షాక్ అవుతుంది.ఇవన్నీ చేశావు కదా.. నా కోసం ఇంకో సాయం చేయాలి శృతి. నువ్వు ఎదురుగా ఉంటే ప్రేమ్ చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. నువ్వు కనబడుతుంటే.. ప్రేమ్ ఎప్పుడు తన మనసును మార్చుకుంటాడో అని భయమేస్తుంది.
నువ్వు ఏ క్షణమైనా ప్రేమను బయటపెడతావని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని.. ఈ పెళ్లి అయిపోయేంతవరకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇంకెక్కడైనా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అని చెబుతాడు నందు. దీంతో తులసి, శృతి షాక్ అవుతుంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు మాత్రమే. తర్వాత పెళ్లి కాగానే నువ్వు ఇంటికి వచ్చేయొచ్చు.. అని చెబుతాడు నందు. నేను ఇప్పటికే అంధకారంలో ఉన్నాను. ఇప్పుడు మీరు అడిగింది చేయడం తప్ప నాకు ఇంకో దారి లేదు. మీరు అడిగినట్టే చేస్తాను అంకుల్. ఈ ఇంటి నుంచి వెళ్లిపోతాను.. అని చెబుతుంది శృతి.
మరోవైపు ప్రేమ్, అక్షర పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. అందరూ సంతోషంగా ఉంటారు కానీ.. తులసి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. పైనుంచి శృతి చూస్తుంది. ఇష్టం లేకున్నా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొంటాడు ప్రేమ్. ఇద్దరికీ మంగళస్నానం చేయిస్తారు.ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతా అని చెప్పి ఇంకా వెళ్లిపోకుండా ఇంట్లోనే ఉన్నావు ఎందుకు అని లాస్య, నందు.. ఇద్దరూ శృతికి వార్నింగ్ ఇస్తారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా?.. అంటూ నందు అనేసరికి.. చూడండి నన్ను బెదిరించకండి.. నిజంగా నేను ప్రేమ్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నన్ను ఎవ్వరూ ఆపలేరు. చివరకు ఆ దేవుడు దిగివచ్చినా సరే.. మమ్మల్ని వేరు చేయలేరు.. అంటుంది శృతి.
మీరందరూ కళ్యాణ మండపానికి బయలుదేరండి. నేను ఇటు నుంచి ఇటే వెళ్లిపోతాను.. అని చెబుతుంది శృతి. ఇదొక్కటే దారి.. అంటుంది శృతి. నిన్ను నమ్మొచ్చా.. అంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది శృతి. ఇంతలో తులసి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఎందుకు నీ ప్రేమను దాచుకున్నావు.. అని ప్రశ్నిస్తుంది. ప్రేమ్ అంటే నాకు ఇష్టం అని ఒక్కమాట చెప్పు.. వెంటనే అక్షర స్థానంలో నిన్ను తీసుకెళ్లి కూర్చోబెడతాను అని అంటుంది తులసి. మరోవైపు జీకే వచ్చి ఈ క్షణం నుంచి మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నా. నా కూతురును నీ కన్నకూతురులా చూసుకుంటా అని మాటివ్వు అమ్మా.. అని తులసిని జీకే అడుగుతాడు. దీంతో తులసి మాటివ్వడానికి ఆలోచిస్తుంది. దీంతో జీకే షాక్ అవుతాడు. నందు, లాస్య కూడా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.