intinti gruhalakshmi 9 december 2022 full episode
Intinti Gruhalakshmi 9 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 811 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు కోపంలో, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా నిర్ణయం తీసుకోండి అని నందుతో చెబుతుంది తులసి. దీంతో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేం తులసి అంటాడు నందు. దీంతో ఈ గొడవ పిల్లల మీద పడుతుంది అంటుంది తులసి. అర్థం అయ్యేలా చెప్పాలి. కనీసం మానవత్వం అయినా చూపించండి. లాస్య నా పట్ల లెక్కలేనని తప్పులు చేసింది. అయినా నేను క్షమించేశాను. అందుకే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఆమె ముఖం చూడగలుగుతున్నాను. ఈ ఇంటికి రాగలుగుతున్నాను అంటుంది తులసి.
intinti gruhalakshmi 9 december 2022 full episode
ఆ తర్వాత తను వెళ్లిపోబోతుండగా వచ్చి బాధగా ఉంది తులసి. తప్పయింది. ఇంకోసారి ఇంటికి వస్తే నువ్వు పిల్లలతో సంతోషంగా గడపడానికి మాత్రమే వస్తావు. నేను మాటిస్తున్నాను అంటాడు నందు. దీంతో అది ఇప్పటి కోరిక కాదు. పాతికేళ్ల నాటి కోరిక. నా కోరికను నెరవేర్చుకోవడం కోసం అప్పటి నుంచి కిందా మీదా పడుతున్నాను. నిజంగా నా కోరిక నెరవేరితే నాకన్నా ఎక్కువగా సంతోషించేవారు ఉండరు. అత్తయ్య మామయ్యను జాగ్రత్తగా చూసుకోండి అంటుంది తులసి. దీంతో నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త అంటాడు నందు. ఆ తర్వాత తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తులసి తనతో మాట్లాడిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది లాస్య. ఇంతలో అక్కడికి నందు వస్తాడు. లాస్య కింద పడేసిన అన్ని వస్తువులను తీసి ఎక్కడివి అక్కడ సర్దుతాడు. ఇంతలో లాస్య వచ్చి తను కూడా సర్దబోతుంది. దీంతో నందునే తీసి వాటిని అక్కడ పెట్టి సారీ ఆవేశంలో చాలా మాటలు అనేశాను. నిన్ను హర్ట్ చేశాను అంటాడు నందు.
దీంతో తప్పు నాదే నందు అంటుంది లాస్య. నేను మారుతానని నువ్వు నమ్ముతున్నావు కదా. నేను నీ దగ్గరికి రావచ్చు కదా అంటుంది లాస్య. ఈ ఇంటి కోడలుగా నువ్వు ఇన్నాళ్లు చేయలేని పని ఇప్పుడు చేయాలి. ఇంటి వాళ్లతో కలిసిపోవాలి అని అంటాడు నందు.
నాకు కావాల్సింది ఇంట్లో ప్రశాంతత. ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉండటం. తులసి చేసింది అదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. దీంతో నిన్ను దారిలోకి తెచ్చుకోవడం కోసమే నేను తగ్గాను కానీ.. అలాంటి పనులు చేయడం కోసం కాదు.
ఈ ఇంటిని ఆయుధంగా మార్చుకొని నీ ఫ్యామిలీని రోడ్డు మీదికి లాగుతాను అని అనుకుంటుంది లాస్య. మరోవైపు తులసి నా బతుకు నేను బతుకుతాను అని అనుకుంటుంది తులసి. పుస్తకాలు తీస్తుండగా తన తీరని కోరికలు కనిపిస్తాయి.
వెంటనే ఆ పుస్తకాన్ని పట్టుకొని తీరని ఆశలు బాధలను ఇస్తాయి అని అనుకుంటుంది తులసి. తీరని ఆశలు ఎన్నో.. తీరుతాయో లేదో తెలియకపోయినా ఆశతో నా ఆశలన్నింటినీ ఒక దగ్గర రాసుకుంటున్నాను అని అనుకుంటుంది తులసి.
ఇష్టపడిన వాడితో జీవితం పంచుకోవాలి. ఈ కోరిక తీరిందో తీరలేదో నాకే అయోమయంగా ఉంది. ఏదీ నా ఇష్ట ప్రకారం జరగలేదు. గాల్లో విమానంలో ఎగురుతూ రెక్కలొచ్చిన పక్షిలా సంతోషంగా ఎగరాలి అనే కోరిక మాత్రం తీరింది అని అనుకుంటుంది తులసి.
సామ్రాట్ గారి పుణ్యమాని ఆ కోరిక తీరింది అని అనుకుంటుంది. సముద్రపు ఒడ్డున నిలబడి నీళ్లు నా పాదాలను తాకుతుంటే ఒళ్లు పులకరించిపోవాలి.. ఈ ఆశ కూడా సామ్రాట్ గారి పుణ్యమాని తీరింది. నా జీవితాంతం అత్త మామలకు సేవ చేసుకోవాలి అని అనుకుంటుంది తులసి.
నా కాళ్ల మీద నేను నిలబడాలి అనే కోరిక కూడా సామ్రాట్ పుణ్యమాని నెరవేరింది. ఆశలకి అంతే ఉండదు. హద్దు కూడా ఉండదు. నా వరకు ఇంకా తీరని ఆశలు చాలా ఉన్నాయి. అవేవీ గొంతెమ్మ కోరికలు కావు. చిన్నిచిన్ని ఆశలు రాసిపెట్టుకుంటాను. అవి తీరకపోతాయా? అని చెప్పి మళ్లీ కొన్ని కోరికలను రాసుకుంటుంది తులసి.
వాటిని అన్నింటినీ రాసుకొని ఒకసారి చదువుకుంటుంది. ఇంతలో తనకు తన తల్లి గుర్తొస్తుంది. వెంటనే ఫోన్ చేస్తుంది. చెప్పరా తల్లి అంటుంది. ఏం చేస్తున్నావు అంటే జీవితం గురించి ఆలోచిస్తున్నా అంటుంది తులసి.
ఆలస్యం అయిందేమో అని ఆలస్యం అయిందేమో కానీ.. జీవితం మాత్రం ముగిసిపోలేదు కదా అంటుంది తులసి. నా వయసులో నేను మాట్లాడాల్సిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటుంది సరస్వతి.
నీ మాటల్లో నిరాశ కనిపిస్తోంది అమ్మ అంటుంది సరస్వతి. నీకు జన్మనిచ్చాను కానీ.. మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను అని బాధగా ఉంది అంటుంది. రేపు ఉదయం నేనే మీ ఇంటికి వస్తా. మా అమ్మకు ఇష్టమైన టిఫిన్ నేనే చేసుకొని తీసుకొస్తా. సరేనా అంటుంది తులసి.
మరోవైపు హనీ కోసం షాపింగ్ చేసి వస్తాడు సామ్రాట్. కానీ.. తను రాదు. ఏమైంది రాలేదు. ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటాడు సామ్రాట్. చూస్తే ఏదో ఆలోచించుకుంటూ ఒకచోట కూర్చొంటుంది హనీ.
ఏమైంది డల్ గా కూర్చున్నావు అని అడుగుతాడు దీంతో ఒంట్లో బాగానే ఉంది కానీ.. మనసు బాగో లేదు అంటుంది హనీ. నీకు మనసు బాగోలేదా ఏమైంది అంటే.. నా బాధ, టెన్షన్ నీవే కదా అంటుంది.
దీంతో నీకేం కావాలి అంటాడు. దీంతో మాట మీద ఉంటావా? వెనక్కి తగ్గవు కదా. ప్రామీస్ అంటుంది హనీ. ఎగ్జామ్ లో నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి అంటుంది హనీ. దీంతో షాక్ అవుతాడు సామ్రాట్.
అది నేను ఎలా తీసుకొస్తాను. నువ్వు కదా తెచ్చుకోవాల్సింది అంటాడు సామ్రాట్. నేను చాలా సార్లు మంచిగానే రాస్తున్నా కానీ.. ఇప్పటి వరకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు అంటుంది హనీ. దీంతో ఏం చేయాలో సామ్రాట్ కు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.