Intinti Gruhalakshmi kasturi : మూడు సార్లు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాను: నటి కస్తూరి
Intinti Gruhalakshmi kasturi : జీవితంలో తాను 3 సార్లు చావు అంచుల దాకా వెళ్లి వచ్చానని ప్రముఖ నటి కస్తూరి అన్నారు. ఒకప్పుడు అన్నమయ్య, భారతీయుడు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన కస్తూరి.. ప్రస్తుతం గృహలక్ష్మి అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జీవితంలో తాను అనుభవించిన పలు విషాదకర సంఘటనలను ఆమె గుర్తు చేసుకున్నారు.రెండు సార్లు తన తల్లిదండ్రుల ద్వారా, మరోసారి తన కూతురు రూపంలో… చావుని అతి దగ్గరగా చూశానంటూ కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు. తాను పడ్డ కష్టం ఎవరికీ రాకూడదని కోరుకున్నారు.

Intinti Gruhalakshmi kasturi about her life
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన కస్తూరి… అనుకోకుండా సినిమాలకు దూరం అయ్యారు. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అలనాటి నటి… మళ్ళీ సీరియళ్లతో బిజీ అయ్యారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి ద్వారా కస్తూరీ తన నటనతో ప్రస్తుతం లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.