Director Sukumar : ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది.. డైరెక్టర్ సుకుమార్ గురించి ఇన్నాళ్ళూ ఎవ్వరికీ తెలియని బ్రేకింగ్ న్యూస్ !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 10 May 2023, 3:00 pm

Director Sukumar : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది కూడా హిట్ అయితే సుకుమార్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోతుంది. ఇకపోతే ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న సుకుమార్ ఆయన శిష్యులు కూడా అదే రేంజ్ లో ఉన్నారు. బుచ్చిబాబు సానా, పల్నాటి సూర్య ప్రతాప్,శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు లాంటి వారు మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు.

కుమారి 21ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సూర్య ప్రతాప్ సుకుమార్ గురించి మాట్లాడారు. ఆర్య నుంచి నేనొక్కడినే సినిమా వరకు అన్నయ్య తో పని చేశా. ఆయన ఆలోచన విధానానికి మంత్ర ముగ్ధులు అవుతాం. ఆయన నుంచి నేర్చుకోవడానికి బానిసలైపోతాం. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. నాకు ఆయన ఐదు కథలిచ్చారు. అందులో కొన్ని తిరిగి ఇవ్వమని అడిగారు. కానీ ఇవ్వనని చెప్పా. ఇద్దరి మధ్య అలాంటి స్నేహం ఉంది’ అని అన్నారు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు మొదట సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. 100% లవ్ సినిమా నుంచి రంగస్థలం వరకు పని చేశా. ఏ ఫిల్మ్ స్కూల్ ఇవ్వని అనుభవం, విజ్ఞానం ఆయన అందించారు.

Intresting news about Director sukumar

Intresting news about Director sukumar

ఏదైనా నిర్మొహమాటంగా అడగొచ్చు. అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ఆయన స్కూల్ నుంచి వచ్చిన వారే. సర్ దగ్గర చాలా మంది అసిస్టెంట్లు ఉంటారు. అందరిని సమానంగా చూస్తారు. ఇప్పటికీ ఆయన కథ రాయాలంటే వంద రకాలుగా ఆలోచిస్తారు. ప్రతి సన్నివేశాన్ని భాధ్యత, భయంతో చేస్తారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు మాట్లాడుతూ విరూపాక్ష కంటే ముందే కథ చెప్పా. అది నచ్చలేదు. విరూపాక్ష కథ నచ్చడంతో నేను పని చేస్తా నిర్మాతగా ఉంటా అని అన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్న అందువల్ల నా ఆలోచన స్థాయి పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి