Director Sukumar: వైసీపీకి డైరెక్టర్ సుకుమార్ సపోర్టు, అందుకే ఆ అవార్డుల ఫంక్షన్‌కి వెళ్లారా?
ప్రధానాంశాలు:
Director Sukumar: వైసీపీకి డైరెక్టర్ సుకుమార్ సపోర్టు, అందుకే ఆ అవార్డుల ఫంక్షన్‌కి వెళ్లారా?
Director Sukumar : మెగా ఫ్యామిలీ హీరోలకు చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన సినిమాలను అందించిన దర్శకుడు సుకుమార్ Sukumar. ఆర్య, రంగస్థలం, పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ వంటి సంచలనాత్మక చిత్రాలను మెగా ఫ్యామిలీ కి అందించాడు. త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram charan తో కూడా ఆయన పీరియాడిక్ జానర్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఇలా ఆయన కెరీర్ లో సంచలనాత్మకంగా నిల్చిన సినిమాలన్నీ మెగా హీరోలు అందించినవే.
అలాంటి సుకుమార్ ఒక్కసారిగా ‘సాక్షి ఎక్సెలెన్స్ అవార్డ్స్’Sakshi Excellence Awards లో పాల్గొనడం సంచలనం రేపింది. ‘సాక్షి ఎక్సెలెన్స్ అవార్డ్స్’ ని ప్రతీ ఏడాది మాజీ సీఎం జగన్ సతీమణి భారతి గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు. ఇటీవల జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డులలో, సుకుమార్ తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024 మరియు బెస్ట్ పాపులర్ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ 2024 బిరుదులతో సత్కరించబడ్డాడు. సాక్షి మీడియా గ్రూప్ గత పదేళ్లుగా ఎక్సలెన్స్ అవార్డులను విజయవంతంగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, విద్య, సామాజిక అభివృద్ధి, వ్యాపారం, పరిశ్రమ మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో ఈ అవార్డులు ఇవ్వబడ్డాయి.
వైసీపీకి సపోర్టుగా..
అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్లినప్పటి నుండి మీడియాలో ఏ స్థాయి నెగటివిటీ అతనిపై ఏర్పడిందో అందరికీ తెలిసిందే. ఇదే విధంగా శత్రువు గడప తొక్కినందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుకుమార్ పై కోపంతో ఉన్నారు. సుకుమార్ ని ఒక డైరెక్టర్ గా ఎంతో ప్రేమిస్తామని, ఇలా శత్రువులు నిర్వహించే ఈవెంట్స్ కి వెళ్తే, గతంలో జరిగిన పరిణామాలన్నిటిని కనెక్ట్ చేసుకొని, సుకుమార్ కూడా వైసీపీ పార్టీ కి సపోర్టు చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుందని పవన్ అభిమానులు అంటున్నారు.