Rao Ramesh : ఇండస్ట్రీలోకి రాకముందు నటుడు రావు రమేష్ ఏం చేసేవాడో తెలుసా ..?? డబ్బుల్లేక ఈ పని కూడా చేశాడట ..??

Authored By aruna | The Telugu News | Updated on : 21 August 2023, 11:00 am

Rao Ramesh : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ కొత్తబంగారులోకం ‘ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు రావు రమేష్. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తర్వాత వరుస సినిమాలతో పాపులర్ అయ్యారు. ఇంతకీ రావు రమేష్ ఎవరో కాదు పాత సినిమాలలో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న రావు గోపాల్ రావు తనయుడు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు రావుగోపాల్ రావు. ఆయన కొడుకే ఈ రావు రమేష్. తండ్రి నటన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎటువంటి పాత్రనైనా చేయగలిగే రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించేశారు. ఇకపోతే రావు రమేష్ శ్రీకాకుళం లో జన్మించారు. చెన్నైలో పెరిగారు. అయితే ఆయన నటుడు అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదట. నటనపై అంత ఆసక్తి కూడా లేదట. మధ్యలో చదువు ఆపేసిన రమేష్ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే క్యాలిఫోర్నియా అకాడమీలో ఒక కోర్సుకు దరఖాస్తు చేసుకున్నాడు.

Intresting news about Rao Ramesh

Intresting news about Rao Ramesh

ఈ క్రమంలోనే రావు గోపాలరావు గారు మరణించారు. దీంతో తల్లి నటన వైపు వెళ్ళమని సలహా ఇచ్చిందట. అది ఇష్టం లేక ఎన్నోసార్లు జాబ్ కోసం వెతికాడు. నిర్మాణం వైపు అడుగులు వేయాలని ఓ నిర్మాతతో కలిసి సినిమాను తీశారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది దీంతో నష్టం కూడా వచ్చింది. తర్వాత చెన్నైలో పుట్టగొడుగుల బిజినెస్ స్టార్ట్ చేశారు అది కూడా ఫ్లాప్ అయింది. చివరకు తన తల్లి చెప్పిన మాట విని ఇండస్ట్రీలోకి వచ్చాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ గా ఎదిగారు.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp