
Pushpa 2 movie
Allu Arjun : సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న ‘ పుష్ప 2 ‘ సినిమా కోసం దేశమంతటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. దీంతో ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ వచ్చినా అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ పై ఇటీవల ఐటి దాడులు జరిగాయి. దీని వలన సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. అయితే ఈ షూటింగ్లో బన్నీ లేడు అని తెలుస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ బంజారాహిల్స్ లో ఉన్నాడు. ఆహా ఛానల్ కోసం ఓ ప్రమోషనల్ యాడ్ చేసాడు. ఈ ప్రమోషనల్ యాడ్ ను త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. మొదట అర్జున్ లీల అంటూ ప్రకటన చేయడంతో ఇది వెబ్ సిరీస్ ఏమో అని అందరూ అనుకున్నారు కానీ ప్రమోషనల్ యాడ్ అని తెలిసింది. అయితే ఈ యాడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. వీరిని పరామర్శించడానికి బన్నీ ఆసుపత్రికి వెళ్ళాడు. దీంతోపాటు పలు వివాహ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి.
Pushpa 2 movie
అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. సుకుమార్ మారేడుమిల్లి అడవుల్లో బన్నీలేని షూటింగ్ పార్టును తీస్తున్నాడు. త్వరలోనే బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. రష్మిక బన్నీ మీద వచ్చే సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాను అత్యధిక బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పాయి. పుష్ప మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ రెండో పార్ట్ కి వస్తుందా లేదా అనేది చూడాలి. ఇదే జరిగితే బన్నీకి పాన్ ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్ ఇంకా పెరుగుతుంది. ఇక తర్వాత అన్ని పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు చేస్తాడు అనడంలో సందేహం లేదు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.