Home » Entertainment » Mahesh Babu Guntur Karam Movie Update
Entertainment

Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ రిలాక్స్ అయిపోండి .. గుడ్ న్యూస్ వచ్చేసింది !

Authored By
aruna
The Telugu News | Published on: June 21, 2023, 8:00 pm
Advertisement

Mahesh Babu : ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ గుంటూరు కారం ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా ఆరు నెలల్లో విడుదల కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై గాసిప్స్ వస్తున్నాయి. సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్న ఇంకా టెక్నీషియన్ల విషయంలో నటీనటుల విషయంలో ఊహించని వార్తలు రావడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో అభిమానులు చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా నుంచి తొలగించారని, మహేష్ బాబుకు అతని ట్యూన్స్ నచ్చలేదని, అందుకే వద్దనుకున్నారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

అలాగే హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే వీటన్నింటికీ చిత్రం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. తమన్ ను తీసేసి అతడి స్థానంలో జీవి ప్రకాష్ లేదా అనిరుద్ ను తీసుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని అన్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ రెడీ చేస్తున్నారట. ఇక హీరోయిన్ల విషయంలో కూడా చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో చిత్రం పెద్దగా క్లారిటీ ఇచ్చినట్లు కనిపించడం లేదు. హీరోయిన్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని ఆ విషయంపై గుంటూరు కారం టీం నుంచి క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది.

Mahesh Babu Guntur karam movie update

Advertisement

ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే తో పాటు లేటెస్ట్ గ్లామరస్ యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే పూజ హెగ్డేను తీసేసి మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఇక ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జూన్ 24వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సినిమాను వచ్చేఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్రకటించేశారు. అయితే హీరోయిన్ విషయంలో త్రివిక్రమ ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి