Tollywood : ఇప్పటి వరకు హిట్ కొట్టని హీరో పై వంద కోట్లు..!

Authored By aruna | The Telugu News | Published on: July 30, 2022, 8:20 pm

Tollywood : సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టిన వాళ్లకు మాత్రమే గుర్తింపు ఆదరణ ఉంటుంది. వారి సినిమాలపై మాత్రమే బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తారు, కానీ కొందరు హీరోల విషయంలో మాత్రం పై పద్ధతి వర్తించదు ఏమో అనిపిస్తుంది. ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా యొక్క బడ్జెట్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇప్పటి వరకు అక్కినేని అఖిల్ కమర్షియల్గా ఒక్క సక్సెస్ ను దక్కించుకోలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. అక్కినేని అఖిల్ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఆయనకు సక్సెస్ అనేది అందని ద్రాక్షే అయింది. దాంతో ఆయన సినిమాల యొక్క బడ్జెట్ రోజు రోజుకు తగ్గాల్సి ఉంటుంది. కానీ ఏజెంట్ సినిమాకు మాత్రం ఏకంగా వంద కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. సినిమా కు మొదట 60 కోట్లు అనుకున్నారు, కానీ 60 కోట్లతో సినిమా ఆశించిన స్థాయిలో రాలేదు. పైగా కొన్ని సన్నివేశాలు సరిగా లేవని రీ షూట్ చేస్తున్నట్లు గా కూడా సమాచారం అందుతోంది. అందువల్ల సినిమాకు ఏకంగా వంద కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

investing 100 crores on tollywood hero with zero blockbusters

investing 100 crores on tollywood hero with zero blockbusters

ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హిట్‌ అందుకొని అఖిల్ అక్కినేని కి రూ. 100 కోట్ల బడ్జెట్ అంటే కచ్చితంగా చాలా హెవీ అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అయినా కూడా దర్శకుడు మరియు నిర్మాత ఏమాత్రం వెనకాడకుండా వంద కోట్ల సినిమా ను అఖిల్ అక్కినేనికి ఇవ్వబోతున్నారు. ఈ వంద కోట్ల సినిమా వంద కోట్లను వసూళ్లు చేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. వంద కోట్ల వసూళ్లు వస్తే అఖిల్ అక్కినేని టాలీవుడ్ లో స్టార్ హీరో గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టులోనే రావాల్సి ఉన్నా చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో లేదా సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు ఏమో చూడాలి.

aruna

No bio available for this author.

  1. "Teja Sajja Engagement : ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థం.. కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే!"

  2. "Chandrababu : ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి మరో బెర్త్? రేసులో ఆ ఎంపీ!"

  3. "Giribabu VS SR NTR : ఎన్టీఆర్‌కే ఎదురు తిరిగిన గిరిబాబు? 48 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?"

  4. "Tummala Nageswara Rao : కాంగ్రెస్ మళ్లీ గెలవడం కష్టమే.. నేనూ పోటీ చేయను.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు!"

  5. "Gold Rate Today : తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం.. నిపుణుల అంచనాలివే!"

  6. "Karthika Deepam 2 Today Episode : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  7. "Cheyutha Pensions : రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్‌.. 4,63,857 మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న నగదు జమ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp