is Balakrisha the reason for jr ntr becoming a mass hero
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి మాస్ హీరోగా ఎదిగేవరకు దాని వెనుక బాబాయ్ బాలకృష్ణ హస్తం ముందని టాక్ వినిపిస్తోంది. అయితే, నందమూరి బాలకృష్ణ, కొడుకు యంగ్ టైగర్ కాంబినేషన్‌లో మూవీ వస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒక వేళ ఈ ప్రాజెక్టు వస్తే క్రేజీగా ఉంటుందని, ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న రికార్డులు అన్నీ చెరిగిపోతాయని అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలయికలో మూవీ వస్తుందని ఇంతవరకు ఎవరూ ఊహించలేదు. కానీ ఎస్ఎస్ రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.అదే విధంగా మెగాస్టార్, బాలయ్య బాబు కాంబినేషన్లో కూడా సినిమా వస్తే చూడాలని అటు మెగాఅభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఆశగా చూస్తున్నారు. అయితే, ఇటువంటి క్రేజీ ప్రాజెక్టును డీల్ చేయడానికి ముందుగా దర్శకుడికి గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇందులో ఏ హీరోను తక్కువ చేసి చూపించినా ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ నందమూరి ఫ్యాన్స్ కొంత హర్ట్ అయ్యారు. చరణ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని తమ హీరోను తక్కువ చేసి చూపారని అంతా నిరాశకు లోనయ్యారు.
is Balakrisha the reason for jr ntr becoming a mass hero
మరికొందరు సోషల్ మీడియా వేదికగా దర్శకధీరుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు.ఇదిలాఉంటే ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదగడానికి తన బాబాయ్ హస్తం ఉందని టాక్ వినిపిస్తోంది. అప్పట్లో వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఆది సినిమా మాస్ బంపర్ హిట్.ఈ సినిమా స్టోరీని ముందుగా బాలయ్య కోసం తయారుచేశాడట వినాయక్. కానీ ఆ తర్వాత ఆ స్టోరీని ఎన్టీఆర్ కు చెప్పి ఒప్పించాడు. దీంతో ఆది సినిమాను తీశారు. ఇది విడులయ్యాక ఎన్టీఆర్ ఒక్కసారిగా మాస్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు.దీనితో పాటు సింహాద్రి స్టోరీని కూడా ముందుగా బాలయ్య బాబు కోసం విజయేంద్రప్రసాద్ రాశారట.కానీ రాజమౌళి ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు చెప్పి ఒప్పించడంతో ఆ సినిమా భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ మాస్ హీరో అవ్వడానికి బాలయ్య కృషి ఉందని కూడా అంటున్నారు.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.