tejaswi comments on Bigg Boss kaushal
Tejaswi : తేజస్వి మదివాడ.. ఐస్‌క్రీం చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ. బిగ్ బాస్ షోలో రెండు సార్లు అడుగుపెట్టి అందరి మనసులు గెలుచుకుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ మరింత ఫాలోయింగ్‌ను తెచ్చుకుంటోంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన ఈ భామ.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ భామ వీలున్నప్పుడల్లా ఫోటో షూట్‌లు చేస్తూ కేక పెట్టిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు కమిట్‌మెంట్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తేజస్వి కొన్ని సంచలన విషయాలను పంచుకుంది.
ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మాట్లాడుతూ.. ఓ సారి సుమారు 30 మంది తాగొచ్చి తనను ఎటాక్ చేశారని.. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని తెలిపింది తేజస్వి.ఇక చాలా రోజుల తర్వాత కౌశల్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చింది. బిగ్ బాస్ లో నుండి తాను బయటికి వచ్చిన వెంటనే తన ఫ్రెండ్స్ తనను పట్టుకుని ఏడ్చేశారట. ఏమైంది అని చూస్తే మీమ్స్, బూతులు.. ఇష్టం వచ్చినట్లు చేశారని.. దీనితో ఉన్న ఆఫర్స్ కూడా పోయినట్లు తేజస్వి కామెంట్స్ చేసింది. అతడి వల్లే ఇలా అయ్యాను అని.. అమ్మాయిలని బదనాం చేసి ముందుకు వెళ్ళాలనే మనస్తత్వం అతడిది.
tejaswi comments on Bigg Boss kaushal
కౌశల్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. దర్శకుడు నాకు కమిట్మెంట్ కథ చెప్పగానే.. ఇది ఇండస్ట్రీలో కౌశల్ లాంటి వ్యక్తుల గురించే అని అనిపించింది. అతడిపై రివేంజ్ లాగా అనిపించినట్లు తేజస్వి పేర్కొంది. బిగ్ బాస్ లో అతడి ప్రవర్తన అంతా ఫేక్ అని ఇప్పుడు ఆయన గురించి అందరికి తెలుసు అని తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. మొన్నటికి మొన్న శ్రీరెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వి ఇప్పుడు కౌశల్ గురించి దారుణంగా మాట్లాడుతూ వార్తలలో నిలిచింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.