Bandla Ganesh Doing Movie with Sai Dharam Tej
బడా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తిరిగి నిర్మాతగా అవతారమెత్తేందుకు రెడీ అయ్యాడు. బడా సినిమాల నిర్మాతగా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్ ఒకప్పుడు దూసుకుపోయాడు. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లాడు. ఒక్కసారిగా రాజకీయాల్లోకి వెళ్లి తన పదునైన మాటలు, ప్రాసలతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ అక్కడా కమెడియన్‌గా మారిపోయాడు. రాజకీయాల్లో ఎదురుదెబ్బ తగలడంతో మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు.
Bandla Ganesh Doing Movie with Sai Dharam Tej
రాజకీయాలకు దూరంగా సినిమా రంగానికి దగ్గరగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. అయితే ఆ పాత్రతో బండ్ల గణేష్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. అది నా స్థాయి పాత్ర కాదు.. ఇకపై అలాంటి రోల్స్ చేయను.. అసలు నటించను అని ఖరాఖండిగా చెప్పేశాడు. మొత్తానికి ఇకపై సినిమాలను నిర్మిస్తాను కానీ నటించను అని నిర్ణయానికి వచ్చాడు.
ఓ భారీ సినిమాను నిర్మించే పనిలో పడ్డానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌తో ఓ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నట్టున్నాడు. అదే కాకుండా మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ను కూడా లైన్‌లోపెట్టేశాడని తెలుస్తోంది. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు, చిరంజీవికి చిన్న గిఫ్ట్‌లను ఇచ్చాడు బండ్ల గణేష్. వారికి గిఫ్ట్‌లను ఇస్తూ నా దేవుడు, నా బాస్ అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్‌కు బొకే ఇస్తూ నా హీరో అంటూ తెలిపాడు. అంటే త్వరలోనే ఈ కాంబోలో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.