మొత్తానికి అలా బయట పడింది.. బండ్ల గణేష్ ప్లానింగ్ మామూలుగా లేదు!!

Authored By Admin | The Telugu News | Published on: January 1, 2021, 7:54 pm

బడా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తిరిగి నిర్మాతగా అవతారమెత్తేందుకు రెడీ అయ్యాడు. బడా సినిమాల నిర్మాతగా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్ ఒకప్పుడు దూసుకుపోయాడు. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లాడు. ఒక్కసారిగా రాజకీయాల్లోకి వెళ్లి తన పదునైన మాటలు, ప్రాసలతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ అక్కడా కమెడియన్‌గా మారిపోయాడు. రాజకీయాల్లో ఎదురుదెబ్బ తగలడంతో మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు.

Bandla Ganesh Doing Movie with Sai Dharam Tej

Bandla Ganesh Doing Movie with Sai Dharam Tej

రాజకీయాలకు దూరంగా సినిమా రంగానికి దగ్గరగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. అయితే ఆ పాత్రతో బండ్ల గణేష్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. అది నా స్థాయి పాత్ర కాదు.. ఇకపై అలాంటి రోల్స్ చేయను.. అసలు నటించను అని ఖరాఖండిగా చెప్పేశాడు. మొత్తానికి ఇకపై సినిమాలను నిర్మిస్తాను కానీ నటించను అని నిర్ణయానికి వచ్చాడు.

ఓ భారీ సినిమాను నిర్మించే పనిలో పడ్డానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌తో ఓ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నట్టున్నాడు. అదే కాకుండా మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ను కూడా లైన్‌లోపెట్టేశాడని తెలుస్తోంది. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు, చిరంజీవికి చిన్న గిఫ్ట్‌లను ఇచ్చాడు బండ్ల గణేష్. వారికి గిఫ్ట్‌లను ఇస్తూ నా దేవుడు, నా బాస్ అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్‌కు బొకే ఇస్తూ నా హీరో అంటూ తెలిపాడు. అంటే త్వరలోనే ఈ కాంబోలో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp