pushpa mania still continues
Pushpa Movie : పుష్ప సినిమా బాలీవుడ్ లో వంద కోట్ల ను దక్కించుకుంది. అమెజాన్ లో స్ట్రీమింగ్ మొదలు అయ్యి వారాలు గడుస్తున్నా కూడా ఇంకా హిందీ వర్షన్ ను జనాలు థియేటర్లలో చూస్తున్నారు. ఇది విడ్డూరంగా ఉన్నా.. కొందరు మ్యానేజ్ చేస్తున్నారు అంటూ విమర్శిస్తూ ఉన్నా కూడా అసలు నిజం మాత్రం పుష్ప జెన్యూన్ గా వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. పుష్ప ఇంతటి వసూళ్లకు ప్రథాన కారణం పలువురు క్రికెట్ స్టార్స్ పుష్ప డైలాగ్స్ ను చెప్పడం.. ముఖ్యంగా శ్రీవల్లి స్టెప్ ను చాలా ఫన్నీగా వేయడం. పుష్ప సినిమా కు విపరీతమైన క్రేజ్ ను తెచ్చి పెట్టిన క్రికెటర్స్ వీడియోలు అన్ని కూడా పెయిడ్ అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
క్రికెటర్స్ కు డబ్బులు ఇచ్చి మరీ ఆ వీడియోలు చేయించారు అంటూ కొందరు ట్రోల్ చేయడం విడ్డూరంగా ఉంది. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్స్ మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన క్రికెటర్స్ తో కూడా ఈ వీడియోలు చేయించడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క విరాట్ కోహ్లీ తో ఆ వీడియో ను చేయించి పెయిడ్ పోస్ట్ గా షేర్ చేయించాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. అలాంటి అంత మంది క్రికెటర్స్ తో పెయిడ్ ప్రమోషన్ చేయించాలంటే వచ్చిన దానికి రెండు ముడు రెట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది కేవలం ఫేక్ ప్రచారం మాత్రమే. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది కనుక క్రికెటర్స్ అంతా వీడియో లు చేశారు తప్ప పెయిడ్ కానే కాదు.
cricketers pushpa movie dance steps paid promotion
సోషల్ మీడియాలో పుష్ప సినిమా తగ్గేదే లే డైలాగ్ మరియు శ్రీవల్లి స్టెప్ సునామి కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతి రోజు స్టార్స్ నుండి సామాన్యుల వరకు వీడియోలను షేర్ చేస్తూనే ఉన్నారు. రికార్డు స్థాయిలో వసూళ్లను దక్కించుకున్న పుష్ప సినిమా కు అదే స్థాయిలో నెట్టింట పోస్ట్ లు వస్తున్నాయి. ప్రతి రోజు లక్షల కొద్ది సోషల్ మీడియా పోస్ట్ లు పుష్ప గురించి ముఖ్యంగా శ్రీవల్లి ఫన్నీ స్టెప్పులు మరియు తగ్గేదే లే డైలాగ్ వీడియోలు షేర్ అవుతున్నాయి. ఈ మద్య కాలంలోనే కాదు.. సోషల్ మీడియా ఈ స్థాయిలో పెరిగినప్పటి నుండి ఎప్పుడు కూడా ఒక సినిమాకు సంబంధించిన డైలాగ్ ఇంతగా లేదా డాన్స్ స్టెప్పును ఇంతగా షేర్ చేసింది లేదు.. రీల్స్ చేసింది లేదు అంటూ సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.