is Kajal Aggarwal following Shriya Saran
Kajal – Sriya: కాజల్ శ్రియను ఫాలో అయితే మాత్రం ఇక పై సినీ కెరీర్ అద్భుతమే..అంటున్నారు అభిమానులు. దీనికి కారణాలు ఉన్నాయి. ఇద్దరి కెరీర్ దాదాపు ఇప్పటి వరకు ఒకేలా సాగిందని చెప్పాలి. శ్రియ ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైతే, కాజల్ ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దాదాపు వీరిద్దరు కామన్‌గా అందరి హీరోలతోనూ జతకట్టారు. ఇక వీరిద్దరు ఏ హీరోతో సినిమా చేసిన హిట్ అందుకున్నారు.. హిట్ పేయిర్ అనిపించుకున్నారు. దర్శకుల విషయంలో కూడా అంతే. ఇప్పటి వరకు అటు కాజల్ మీద, ఇటు శ్రియ మీద గానీ..ఇప్పటి వరకు నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు లేరనే చెప్పాలి.
సినిమాల ఎంపికలో..పాత్రలను పోషించడంలోనూ కూడా కాజల్ – శ్రియలది కాస్త డీప్‌గా అబ్జర్వ్ చేస్తే సిమిలర్‌గానే ఉంటాయి. ఇద్దరు కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ కూడా పోషించారు. ఇక సినిమా కెరీర్‌తో పాటు వీరి పర్సనల్ లైఫ్ కూడా సమాంతరంగానే సాగుతుందని చెప్పాలి. ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరి దాపత్య జీవితం అద్భుతంగా సాగుతోంది. ఇక శ్రియ పెళ్లి తర్వాత కూడా భర్త అండ్రూతో చర్చించుకొని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టకుండా కంటిన్యూ అవుతోంది. క్రేజీ ప్రాజెక్ట్ ఏదీ తనవద్దకు వచ్చినా ఓకే చెప్పేస్తుంది. దీనిని బట్టి శ్రియకు సినిమా అంటే ఎంత ప్యాషనో అర్థమవుతోంది.
is Kajal Aggarwal following Shriya Saran
ఇక కాజల్ కూడా ఇదే దారి. పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాలు కమిటయింది. కానీ, గర్భం దాల్చడంతో ఒక్క నాగార్జున సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆచార్య సినిమాతో ఈ నెల ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మరోసారి మెగాస్టార్‌తో జతకట్టింది. అయితే, శ్రియ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాలు – వెబ్ సిరీస్ చేస్తోంది. ఇక్కడే కాజల్..శ్రియను ఫాలో అవుతుందా లేదా అనేది ..ఇప్పుడు అందరిలో కలుగుతున్న కొత్త ఆలోచన. ప్లాన్ చేసుకోకపోయినా ఇప్పటి వరకు ఇద్దరి కెరీర్ సమాంతరంగానే సాగింది. కాజల్ కూడా మగ బిడ్డకు ఇటీవలే జన్మనిచ్చింది. నీల్ కిచ్లు అని పేరు కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరి శ్రియ మాదిరిగా సినిమా కెరీర్‌కు బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా సాగుతుంది. మరి కాజల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.