Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ శ్రియను ఫాలో అయితే మాత్రం ఇకపై సినీ కెరీర్ అద్భుతమే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ శ్రియను ఫాలో అయితే మాత్రం ఇకపై సినీ కెరీర్ అద్భుతమే..

 Authored By govind | The Telugu News | Updated on :21 April 2022,3:41 pm

Kajal – Sriya: కాజల్ శ్రియను ఫాలో అయితే మాత్రం ఇక పై సినీ కెరీర్ అద్భుతమే..అంటున్నారు అభిమానులు. దీనికి కారణాలు ఉన్నాయి. ఇద్దరి కెరీర్ దాదాపు ఇప్పటి వరకు ఒకేలా సాగిందని చెప్పాలి. శ్రియ ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైతే, కాజల్ ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దాదాపు వీరిద్దరు కామన్‌గా అందరి హీరోలతోనూ జతకట్టారు. ఇక వీరిద్దరు ఏ హీరోతో సినిమా చేసిన హిట్ అందుకున్నారు.. హిట్ పేయిర్ అనిపించుకున్నారు. దర్శకుల విషయంలో కూడా అంతే. ఇప్పటి వరకు అటు కాజల్ మీద, ఇటు శ్రియ మీద గానీ..ఇప్పటి వరకు నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు లేరనే చెప్పాలి.

సినిమాల ఎంపికలో..పాత్రలను పోషించడంలోనూ కూడా కాజల్ – శ్రియలది కాస్త డీప్‌గా అబ్జర్వ్ చేస్తే సిమిలర్‌గానే ఉంటాయి. ఇద్దరు కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ కూడా పోషించారు. ఇక సినిమా కెరీర్‌తో పాటు వీరి పర్సనల్ లైఫ్ కూడా సమాంతరంగానే సాగుతుందని చెప్పాలి. ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరి దాపత్య జీవితం అద్భుతంగా సాగుతోంది. ఇక శ్రియ పెళ్లి తర్వాత కూడా భర్త అండ్రూతో చర్చించుకొని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టకుండా కంటిన్యూ అవుతోంది. క్రేజీ ప్రాజెక్ట్ ఏదీ తనవద్దకు వచ్చినా ఓకే చెప్పేస్తుంది. దీనిని బట్టి శ్రియకు సినిమా అంటే ఎంత ప్యాషనో అర్థమవుతోంది.

is Kajal Aggarwal following Shriya Saran

is Kajal Aggarwal following Shriya Saran

Kajal – Sriya : కాజల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

ఇక కాజల్ కూడా ఇదే దారి. పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాలు కమిటయింది. కానీ, గర్భం దాల్చడంతో ఒక్క నాగార్జున సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆచార్య సినిమాతో ఈ నెల ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మరోసారి మెగాస్టార్‌తో జతకట్టింది. అయితే, శ్రియ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాలు – వెబ్ సిరీస్ చేస్తోంది. ఇక్కడే కాజల్..శ్రియను ఫాలో అవుతుందా లేదా అనేది ..ఇప్పుడు అందరిలో కలుగుతున్న కొత్త ఆలోచన. ప్లాన్ చేసుకోకపోయినా ఇప్పటి వరకు ఇద్దరి కెరీర్ సమాంతరంగానే సాగింది. కాజల్ కూడా మగ బిడ్డకు ఇటీవలే జన్మనిచ్చింది. నీల్ కిచ్లు అని పేరు కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరి శ్రియ మాదిరిగా సినిమా కెరీర్‌కు బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా సాగుతుంది. మరి కాజల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది