KGF – Srinidhi Shetty : ఇంత భారీ సక్సెస్ అందుకున్న సిరీస్..కలిసిరానిది మాత్రం హీరోయిన్‌కేనా..?
KGF – Srinidhi Shetty: ఇంత భారీ సక్సెస్ అందుకున్న సిరీస్..కలిసిరానిది మాత్రం హీరోయిన్‌కేనా..? అంతే టాక్ మరోసారి సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఖచ్చితంగా మా ఎంటర్‌టైనర్ అంటే దర్శక నిర్మాతల ఫోకస్ మొత్తం హీరో మీదే ఉంటుంది. అభిమానులకు తగ్గట్టు..హీరో మార్కెట్‌కు తగ్గట్టు ఎలా స్క్రీన్ మీద చూపించాలి..ఎంత పవర్ ఫుల్ పాత్రలో నటింపజేయాలి అనే దాని మీదే దర్శకుడి దృష్ఠి మొత్తం ఉంటుంది. అయితే, చిన్న సినిమా..పెద్ద సినిమా..ఏదైనా కానీ..హీరోయిన్ అనేది ఓ కమర్షియల్ ఎలిమెంట్. తప్పకుండా గ్లామర్ ట్రీట్ కోసం అభిమానులను అలరించడం కోసం క్రేజ్ ఉన్న హీరోయిన్ కావాల్సిందే.
కథలో హీరోయిన్ పాత్ర లేకపోయినా కొన్ని సీన్స్, సాంగ్స్ కోసం క్రియేట్ చేసి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకుంటారు. అయితే, ఇలాంటి సినిమాలతో హీరోయిన్స్‌కు భారీగా రెమ్యునరేషన్ వస్తుంది గానీ, ఆ తర్వాత ఫ్యూచర్ మాత్రం డైలమాలో పడిపోతుంది. సినిమా ఎంత భారీ సక్సెస్ అయినా హీరోయిన్‌కు దక్కే క్రెడిట్ మాత్రం సున్నా. ఇప్పుడు వచ్చిన సినిమాలలో దాదాపు హీరోయిన్ పాత్రలకు అంతగా ప్రాధాన్యం ఉండటం లేదు. అలాంటి వాటిలో కేజీఎఫ్ సిరీస్ చిత్రాలను చెప్పుకోవాలి.ఇందులో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 1లో యష్ సరసన హీరోయిన్‌గా నటించింది శ్రీనిధి శెట్టి. మొదటి భాగంలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
KGF – Srinidhi Shetty: హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
ఉన్నంతవరకు అమ్మడు బాగానే చేసినా అసలు తనకు దక్కిన క్రెడిట్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన ఛాప్టర్ 2లో కూడా సినిమాలో యష్ తర్వాత సంజయ్ దత్ గురించి, హీరో ఎలివేషన్స్, భారీ యాక్షన్ సీన్స్, ఆర్ ఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప హీరోయిన్ గురించి అసలు ఎక్కడా టాపిక్కే లేదు. దాంతో శ్రీనిధికి ఇకపై అవకాశాలు వస్తాయా అనేది అర్థం కాని ప్రశ్న. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా ఉందా అంటే మన వాళ్లలో చాలామందికి ఉందనే విషయం అసలు గుర్తుకు రాదు. బీస్ట్ సినిమాలో కూడా పూజా హెగ్డే ఎందుకు ఉందో ఎవరీ తెలీదు. రూ. 3 కోట్ల వరకు రెమ్యునరెషన్ మాత్రం బుట్టలో వేసుకుందట. ఇలాంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ హీరోయిన్ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు.