Yash : కేజీఎఫ్ దెబ్బ‌కి కోట్ల‌లో రెమ్యున‌రేష్‌.. రాఖీ భాయ్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Yash : కేజీఎఫ్ దెబ్బ‌కి కోట్ల‌లో రెమ్యున‌రేష్‌.. రాఖీ భాయ్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :8 January 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Yash : కేజీఎఫ్ దెబ్బ‌కి కోట్ల‌లో రెమ్యున‌రేష్‌.. రాఖీ భాయ్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..!

Yash : హీరో అవ్వటానికి ఊరిని వదిలేసి మరి ఎందరో పట్నం వచ్చి కష్టాలు పడుతుండ‌డం మ‌నం చూశాం. అలా ఈ హీరో కూడా సినిమాల మీద ఉన్న పిచ్చితో చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుకున్నాడు క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ .ఒకప్పుడు పలు ప్రైవేటు కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోటర్ గా కెరియర్ ఆరంభించిన యష్ Yash ఆ తర్వాత యాడ్స్ చేస్తూ.. ఒక మోస్తారు గుర్తింపు అందుకున్నారు. ఇక ఎప్పుడైతే సీరియల్స్ లోకి వచ్చారో .. అప్పుడు దర్శకుల కంట్లో పడ్డారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశాన్ని దక్కించుకున్నారు.. ముఖ్యంగా ఈయన నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి…

Yash కేజీఎఫ్ దెబ్బ‌కి కోట్ల‌లో రెమ్యున‌రేష్‌ రాఖీ భాయ్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే

Yash : కేజీఎఫ్ దెబ్బ‌కి కోట్ల‌లో రెమ్యున‌రేష్‌.. రాఖీ భాయ్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..!

Yash అన్ని ఆస్తులా..

ఇక తర్వాత ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ Prashanth Neel దర్శకత్వంలో ‘కేజిఎఫ్’ సినిమాలు చేసి, పాన్ ఇండియా హీరో అయిపోయారు. 2000లో టీవీ ఆర్టిస్ట్‌గా తెరపైకి వచ్చిన యష్ ఆతరువాత స్టార్ గా ఎదిగాడు.. నిరంతర శ్రమతో కన్నడ సినిమా స్టార్‌గా ఎదిగిన యష్.. నటన, డ్యాన్స్, డైలాగ్‌ల ద్వారా ప్రజల మనసులను గెలుచుకున్నాడు. ఆఫ్ స్క్రీన్‌లో కూడా, యష్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ.. రియల్ హీరోన అనిపించకున్నాడు. ఇక యష్ ప్రస్తుత ఆస్తుల విలువ 500 కోట్లకుపైగా ఉందని స్టాక్ గో రిపోర్టులు చెబుతున్నాయి. యష్ బాలీవుడ్ హిందీ రామాయణం సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రావణ గెటప్లో విలన్ గా నటించడం కోసం ఏకంగా రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇకపోతే కేజిఎఫ్ సినిమాలకు ముందు వరకు ఒక్కో సినిమాకి రూ.7 కోట్లు పారితోషకం తీసుకున్న ఈయన, ఆ సినిమా విజయం సాధించడంతో వందల కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు ఈ స్టార్ హీరోకు మొత్తం సుమారు 53 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని సమాచారం. యశ్ బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తాడు. ఇందుకోసం కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. యశ్ కు గోల్ఫ్ రోడ్డు సమీపంలోని ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌లో రూ. 4 కోట్ల విలువైన ఇల్లు ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో దీనిని అందంగా అలంకరించాడు. ఇక యశ్ గ్యారేజ్ లో రేంజ్ రోవర్ కారు ఉంది.అలాగే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి , పజేరో స్పోర్ట్స్ హై ఎండ్ కార్లు ఈయన సొంతం. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో నీటి కొరతను పరిష్కరించడానికి ‘యశో మార్గా ఫౌండేషన్’ ని కూడా స్థాపించారు. ఇక అంతే కాదు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండే ఈయన, సమాజ సేవ చేస్తూ ప్రజలలో మంచి పేరు దక్కించుకున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది