Mahesh babu : మహేష్ బాబు కి షాకిస్తూ బాలీవుడ్ సినిమా ..?

Authored By vamana sai | The Telugu News | Published on: February 21, 2021, 12:50 pm

Mahesh babu : మహేష్ బాబు నిర్మాణలో అడవి శేష్ ఒక బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మేజర్ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. గూఢాచారి ఫేం శశి కిరణ్ తిక్కా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సమర్పణలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ – ఏ+ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

is-mahesh-babu-given-shock-by-bollywood-movie

is-mahesh-babu-given-shock-by-bollywood-movie

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తుండగా జూలై 2వ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్, తెలుగమ్మాయి శోబిత దూళిపాళ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ బయోపిక్ సినిమాకి పోటీగా బాలీవుడ్ సినిమా పోటీ కాబోతోంది. దాంతో మహేష్ సోలో డేట్ లాక్ చేసుకుంటే ఈ సినిమా కూడా అదే రోజు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకొని షాకిచ్చిందని అంటున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హాట్ బ్యూటీ కియరా అద్వానీ జంటగా నటిస్తున్న ‘షేర్షా’ అన్న హిందీ సినిమా కూడా జులై 2న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Mahesh babu : మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ పాన్ ఇండియన్ సినిమా..!

ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాబోతుండటం తో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి కరమైన చర్చలు సాగుతున్నాయి. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ – కాశ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై కరణ్ జోహార్ – అపూర్వ మెహతా – షబ్బీర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘షేర్షా’ సినిమా పరమవీర చక్ర అవార్డ్ గ్రహీత కెప్టెన్ విక్రమ్ భాత్ర జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. రెండు సినిమాల కథ లు ఒకే రకమైన కథాంశంతో రూపొందుతున్నాయి. అయితే మేజర్ పాన్ ఇండియన్ సినిమా. ‘షేర్షా’ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ కాబోతోంది. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సత్తా చాటుతుందో.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp