Home » Entertainment » Is Samantha And Naga Chaithanya Going To Take Divorce
Entertainment

Samantha: సమంత – నాగ చైతన్య విడాకులకి సిద్దమయ్యారా.. ఫ్యామిలీ కోర్టులో తేలింది ఇదేనా..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: September 11, 2021, 11:06 am
Advertisement

Samantha: ఈ మధ్య టాలీవుడ్ స్టార్ కపుల్ కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చి హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో ఇష్టంగా నాలుగైదేళ్లు ప్రేమించుకొని, ఇరు కొటుంబాలను ఒప్పించి రెండు మత సాంప్రదాయాల ప్రకారం సినీ ప్రముఖులు, బంధువుల సమక్షంలో అత్యంత వైభవంగా పెళ్ళి చేసుకున్నారు సమంత – నాగ చైతన్య. మొదటి సినిమా ఏ మాయ చేశావేతో ప్రేమలో పడిన ఈ జంట ఒక్కటవగానే అందరూ ఎంతో సంతోషించారు. కానీ ఉన్నపలంగా వీరు విడాకులు తీసుకుంటున్నారనేది అందరికీ షాకింగ్ న్యూస్‌గా మారింది.

Advertisement

is samantha-and naga chaithanya going to take divorce

గత కొన్ని రోజులుగా సమంత – చైతన్య కలిసి కనిపించకపోవడం కూడా ఈ మ్యాటర్‌కి బలాన్ని చేకూర్చుంది. ఇరు కుటుంబాల పెద్దలు ఇద్దరినీ కూర్చోబెట్టి సర్ధి చెప్పినా వినే స్థాయి దాటిపోయారని సమాచారం. ఫ్యామిలీ కోటులో ఉన్న సమంత – నాగ చైతన్యల వ్యవహారం త్వరలోనే తేలిపోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సమంత ప్రవర్తలనలో చాలా మార్పు వచ్చిందని తన సంతోషాల కోసమే అక్కినేని ఫ్యామిలీని వీడి బయటకు రావాలని చూస్తుందట.

Advertisement

Samantha: ఇదే జరగబోతుందని తాజాగా సమంత పెట్టిన పోస్టుల ద్వారా తెలుస్తోంది.

అందుకే ఎంతమంది ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ఆల్రెడీ విడాకులకి అప్లై చేశారట. ఇటీవల బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్ ఖాన్ – కిరణ్ రావు ఇలాగే విడాకులు తీసుకున్న విషయాన్ని అధికారకంగా మీడియా ద్వారా వెల్లడించారు. సమంత – నాగ చైతన్య కూడా అదే చేయబోతున్నారట. దీనికి మరింత క్లారిటీ త్వరలో రానుండగా, ఇదే జరగబోతుందని తాజాగా సమంత పెట్టిన పోస్టుల ద్వారా తెలుస్తోంది.

Advertisement

“నీ నవ్వు నీ చుట్టూ ఉన్న వారికి ఎంత అవసరమో నీకు తెలియదు. నువ్వు చూపించే దయ, మరో వ్యక్తి జీవితం మొత్తాన్ని ఎంతలా మార్చేస్తుందో నీకు తెలీదు. నీ చిరునవ్వు, నువ్విచ్చే ఒక చిన్న కౌగిలింత లేదా లోతైన సంభాషణ ఎదుటి వ్యక్తికి ఎంత అవసరమో నీకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ప్రేమ కురిపిద్దామా అని ఎదురుచూడకు. ఎవరో ఒకరు నీపై ప్రేమ కురిపిస్తారని ఎదురుచూడకు.

samantha and naga chaithanya going to take divorce

 

మంచి పరిస్థితుల కోసమో లేదా ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారనో ఎదురుచూడకు. అందరిపట్ల దయతో ఉండు.ఎందుకంటే, ఎంతమందికి నీ దయ – ప్రేమ అవసరమో తెలియదు కదా”.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా సమంత వరుస పోస్టులు పెడుతూ వస్తోంది. దాంతో సమంత – నాగ చైతన్య దాంపత్య జీవితానికి త్వరలో శుభం కార్డు పడనుందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి