Karthika Deepam 11 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ 11 సెప్టెంబర్ 2021, శనివారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1142 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోర్టులో సౌందర్య.. తన కొడుకు గురించి చెబుతుంది. తన కొడుకు ఏ తప్పూ చేయలేదని చెబుతుంది. నా కొడుకు హత్య చేశాడనే అవకాశాలు తప్పా.. ఆధారాలు మాత్రం నాకు కనిపించలేదు.. అయినా మన శిక్షాస్మృతి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నిర్దోషికి శిక్ష పడదని నా మనస్సాక్షి చెబుతోంది. నా మనస్సాక్షి చెప్పేదే నిజం అయితే తీర్పు వెలువడకముందే నా కొడుకు నిర్దోషిత్వం తెలుస్తుంది.. అని చెబుతుంది సౌందర్య.
ఆ తర్వాత లాయర్ లేచి.. సౌందర్య గారు సాక్షి కన్నా ప్రతిసాక్షి ముఖ్యం అన్నారు కానీ.. ఒక వ్యక్తి నేరం చేశాడో లేదో చెప్పడానికి సాక్ష్యాలు చాలా అవసరం అంటాడు. ఆ తర్వాత లాయర్ వెళ్లి కార్తీక్ ను ప్రశ్నిస్తాడు. మీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది.. అని అడుగుతాడు. 16 ఏళ్లు అంటాడు కార్తీక్. మరి.. 16 ఏళ్ల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటూనే ఉన్నారా? అని అడుగుతాడు. దీంతో.. లేదు.. మేము స్నేహితులం మాత్రమే. మేము ప్రేమించుకోలేదు. తను మాత్రమే నన్ను ప్రేమించింది. నేను మాత్రం తనను ఒక స్నేహితురాలిగానే చూశాను.. అని చెబుతాడు కార్తీక్.
మీరు అప్పుడప్పుడు మోనిత ఇంటికి వెళ్లేవాళ్లు కదా.. అని అడుగుతాడు.. దీంతో అవును అంటాడు. అక్కడికి వెళ్లి తాగేవారా? అని అడుగుతాడు. అవును.. తాగుతాను.. అని చెప్పాడు కార్తీక్. ఇతడు ఒక అనుమానపు మొగుడు. భార్యనే అవమానించి.. పదేళ్ల పాటు దూరంగా ఉంచాడు. తన ఇద్దరు బిడ్డలను కూడా తన బిడ్డలు కాదన్నాడు. ఇటువంటి వ్యక్తిలో వ్యక్తిత్వం ఎక్కడుంది. 10 ఏళ్ల పాటు భార్యకు దూరంగా ఉన్నవాడు.. 10 ఏళ్ల పాటు మోనిత ఇంటికి వెళ్లి వస్తూనే ఉన్నాడు. తాగిన మైకంలో మోనితతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆ తర్వాత తన భార్య తప్పేమీ లేదని తెలుసుకొని తన భార్యాబిడ్డలను ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మోనిత గర్భం దాల్చింది. తనకు న్యాయం చేయాలని మోనిత కేసు పెట్టింది. దీంతో తన అడ్డు తొలగించుకోవడం కోసం మోనితను హత్య చేశాడు.. అని చెబుతాడు లాయర్.
కానీ.. కార్తీక్ తరుపు లాయర్ వెంటనే లేచి.. మోనితను పెళ్లి చేసుకోవాలనుకుంటే.. కార్తీక్ కు అడ్డు చెప్పేవాళ్లు లేరు. కానీ.. కార్తీక్ మోనితను కేవలం ఒక స్నేహితురాలిగానే చూశాడు. అసలు.. మోనితను చంపకున్నా.. ఎలా శిక్ష వేస్తారు. తన శవాన్ని ఒక్కరు కూడా చూడలేదు.. అని చెబుతాడు లాయర్.
కట్ చేస్తే.. మోనిత.. కారులో దీపను తీసుకొని తను ఉండే రూమ్ కు వస్తుంది. వారణాసి అడ్డు తొలగించుకునేందుకు.. మత్తు మందు పెట్టిన కర్చీఫ్ ను పెట్టడంతో వారణాసి మూర్చపోతాడు. ఆ తర్వాత దీపను మోనిత తన రూమ్ కు తీసుకొస్తుంది.
అక్కడ రూమ్ లో నా కార్తీక్.. నా కార్తీక్.. అని రాసి ఉన్న అక్షరాలను, కార్తీక్ ఫోటోను చూసి షాక్ అవుతుంది దీప. ఇదిగో మన కార్తీక్.. కళ్లు తెరిచినా.. మూసినా నాకు కార్తీకే కనిపిస్తాడు. కార్తీక్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఫోటో పెట్టుకున్నాను. నిద్ర లేచినప్పటి నుంచి నా కార్తీక్ తో మాట్లాడుతూనే ఉంటాను. ఎవరైనా చూస్తే పిచ్చిది అనుకుంటారేమో.. అనుకుంటే నాకేంటి.. నా ఫీలింగ్స్ నా కార్తీక్ తో షేర్ చేసుకుంటే తప్పా. చూశావా? ఎలా ఉండాల్సిన దానిని ఎక్కడ ఉన్నానో.. ఇలాంటి చోట ఒకప్పుడు నువ్వు ఉండేదానివి. నేను ఖరీదైన ఫ్లాట్ లో ఉండేదాన్ని. ఇప్పుడు నువ్వు బంగ్లాకు చేరావు. నేను ఈ షెడ్డుకు చేరాను.
కార్తీక్ నేను చెప్పినట్టు వింటే.. నేను ఈ షెడ్డులో ఉండేదాన్ని కాదు కదా. ఆ కుట్రా.. ఈ కుట్రా చేసి ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉంటున్నా. నాకెందుకు ఈ అవస్థ.. అని అంటుంది మోనిత. నీది అవస్థ కాదు.. పతానవస్థ. ఉన్మాద స్థితి అంటుంది దీప. నువ్వు ఏ హక్కు లేకుండా.. ఏ అర్హత లేకున్నా.. ఏ అవకాశం లేకున్నా.. నా భర్త జీవితంలోకి అనవసరంగా తోసుకురావాలని అనుకున్నావు. అది కుదరకపోయే సరికి.. నీలో రాక్షసత్వం విలయతాండవం చేస్తోంది. ఒక్కో తప్పు చేస్తూ నీ పతనానికి నువ్వే పునాది వేసుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బుద్ధిగా వచ్చి పోలీసులకు లొంగిపో. ఏ నేరం చేయని నా భర్తను విడిపించు.. అని చెబుతుంది దీప.
హేయ్.. నేను ఎక్కడికి రాను.. నీ మొగుడే నా దగ్గరికి రావాలి.. పోయి కోర్టు బోనులో నిలుచుకున్నాడు. నా కార్తీక్ కాకుండా పోవడానికి.. నా ప్రపోజల్ ను పట్టించుకోకుండా ఉండటానికి కారణం నువ్వు. అందుకే నిన్ను అడ్డు లేకుండా చేస్తా.. అని దీప తలకు గురి పెడుతుంది మోనిత. చంపేస్తాను.. ఇక్కడే ఈ క్షణమే నిన్ను చంపేస్తాను. క్షణాలు లెక్క పెట్టుకో.. అంటుంది మోనిత.
ఒకటి నుంచేనా లేక 10 నుంచి కౌంట్ డౌన్ మొదలు పెట్టమంటావా.. అంటుంది దీప. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. అని అంటూనే.. గన్ ను లాక్కొని మోనితకు గురి పెడుతుంది దీప. ఐదు నుంచి నువ్వు లెక్కపెట్టుకో క్షణాలు.. అని చెబుతుంది. ఇప్పుడు అర్థమయిందా.. ఎందుకు నీతో కూల్ గా వచ్చానో.. అని చెప్పి.. ఇప్పుడు నీ పుచ్చ పేలుతుంది. ఇన్నాళ్ల నీ పాపం పండిందే.. ఇంతకాలం నీ ఆటలన్నీ భరించాను. అవన్నీ నా వరకే పరిమితం అయ్యాయి కాబట్టి నేను నిన్ను లెక్క చేయలేదు. అదే నేను చేసిన తప్పున.. ఇప్పుడు నీ అఘాయిత్యాలు శృతి మించాయి. నా భర్తను జైలుకు కూడా పంపించేందుకు సిద్ధపడ్డావు.. అంటే నిన్ను ఏమనాలి.. అంటుంది.
ఇంతలోనే.. నేను నిన్ను చంపను.. నువ్వు నన్ను చంపకు. నేను, నువ్వు.. అందరం కలిసి కార్తీక్ తో ఉందాం.. అంటుంది మోనిత. నోర్మూయ్.. ఏమంటున్నావే.. నా భర్తను తగులుకుంటానని నాతోనే చెబుతున్నావా? ఎన్ని నేరాలు చేశావే.. ఎన్ని పాపాలు చేశావే.. నా భర్త దేవుడు… నిన్ను చంపకుండానే క్షమించాడు. ఆయన కాళ్లు కడిగి.. ఆ నీళ్లు నీ నెత్తి మీద చల్లుకోవాలి.. అటువంటిది హత్యా నేరం మోపి అరెస్ట్ అయ్యేలా చేశావు. అయినా వదల్లేదు. నన్ను చంపడానికి గుడికి వచ్చావు. డాక్టర్ లా వచ్చావు.. ఇలా ఎన్నిసార్లు మాయ చేస్తావు. ఎవరినైనా ఒక్కసారి మాయ చేయగలవు. ఇన్ని సార్లు చేయలేవు. నీతో వచ్చింది.. అదును చూసి నిన్ను చంపాలన్న కసితోనే వచ్చానే.. నా భర్తను నిర్దోషిగా విడుదల చేయించడానికి చేసే నరమేధం.. అంటూ మోనితను కాల్చబోతుంది దీప.
దీంతో.. దీప.. నీ కాళ్లు పట్టుకుంటాను.. అని వెళ్లి కాళ్లు పట్టుకుంటుంది. దీంతో.. నువ్వు అందితే కాళ్లు.. లేకపోతే జుట్టు పట్టుకుంటావు.. అని అంటుంది దీప. లే లేవవే.. అంటుంది. నన్ను క్షమించు దీప.. జన్మలో నేను కార్తీక్ ను వదులుకోలేను. చచ్చేదాకా.. కార్తీక్ ను వదలను. ఆగు.. చంపకు.. ప్లీజ్ నేను చెప్పేది విను.. ప్లీజ్. కార్తీక్ దూరమైతే నేను తట్టుకోలేను.. అని అంటుంది మోనిత.
నా వైపు నుంచి ఆలోచించు.. అని దీపను మోనిత చెప్పేసరికి.. ఎందుకు ఇంత ఉన్మాదంతో మాట్లాడుతున్నావే.. ఏ ఆడది కూడా తన భర్తను ఇంకో ఆడదానితో పంచుకోదు. నా భర్త మంచివాడు కాబట్టి.. నిన్ను చంపలేదు. కానీ నేను అంత గొప్పదాన్ని కాదు. నా భర్త అంత మంచిదాన్ని అస్సలు కాదు. నా భర్త కోసం ఏమైనా చేయడానికి రెడీ.. అని అంటుంది దీప.
నా కళ్లలో ప్రాణభయం చూడాలని ఇక్కడికి తీసుకొచ్చావు. నా తెగింపు చూశావా? ఇప్పుడు నేను నీ కళ్లలో ప్రాణభయం చూస్తున్నా. నీ చావు నా చేతుల్లోనేరాసి పెట్టుందే.. చావు.. అంటుంది దీప.
ముద్దాయి డాక్టర్ కార్తీక్… డాక్టర్ మోనితను హత్య చేశాడన్న విచారణ ముగిసింది. గర్భవతిగా ఉన్న స్త్రీని నిర్దాక్షిణ్యంగా చంపినట్టు నిరూపించబడింది కాబట్టి.. అని జడ్జి తీర్పు చెప్పబోతుండగానే దీప కోర్టుకు వచ్చి ఒక్క నిమిషం మైలార్డ్ అంటుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. నా పేరు దీప అని చెబుతుంది. బోనులో నిలబడి ఉన్న డాక్టర్ కార్తీక్ భార్యను అంటుంది. తీర్పు వెలువరించే ముందు ఒక్క ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.. అని చెబుతుంది దీప. ఎస్.. అని జడ్జి అంటాడు. ఇంతలోనే ఆ వ్యక్తి ఎవరా.. అని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాయిభాగంలో చూడాల్సిందే.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.