Rajamouli : చిరంజీవి కన్నా రామ్ చరణ్ గ్రేట్ అన్న రాజమౌళి..షాక్ అయిన ఫ్యాన్స్
Rajamouli : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. చిరంజీవిపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించగా, ఇక చిరంజీవి అయితే ఏకంగా రాజమౌళిని సన్మానించారు. ఒకరిపై ఒకరు తెగ పొగడ్తలు కురిపించుకున్నారు. అయితే ఓ సందర్భంలో రాజమౌళి నాకు చిరంజీవి కన్నా చరణే ఎక్కువ అని అనేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన రాజమౌళి మాట్లాడుతూ.. అందరు నన్ను అడుగుతూ ఉంటారు.. ఇంత సక్సెస్ అందుకున్న అంత హంబుల్ గా ఎలా ఉండగలుగుతున్నారు అని.. ఒక్కసారి చిరంజీవి గారిని చూడండి. ఆయన నుంచి నేర్చుకున్న వాటిలో హంబుల్ నెస్ ఒకటి.. ఎంత ఎదిగినా హంబుల్ గా నేల మీద నిలబడడం ఆయన నుంచే నేర్చుకోవాలి.
డైరెక్టర్ కి ఎంత విజన్ ఉన్నా.. ఎంత బాగా చూపించాలనుకున్నా మంచి టెక్నీషియన్స్ లేకపోతే అది జరగదు. కానీ ఆచార్య విషయంలో అంతా పర్ఫెక్ట్ గా జరిగింది. అన్నపూర్ణలో నేను కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఆచార్య సాంగ్స్ని చూశాను. ఆ కలర్ టోన్ కానీ, ఆ రిచ్ నెస్ కానీ, లైటింగ్ ప్యాట్రన్ కానీ చాలా అద్భుతంగా తిరు గారు చూపించారు అని అన్నారు. ‘మగధీర’ టైమ్‌లో చిరంజీవిగారు కథ విన్నారు. అప్పుడు రామ్ చరణ్ విషయాలన్నీ దగ్గరుండి చిరంజీవిగారే చూసుకుంటారేమో అని అనుకున్నాను. కానీ చరణ్‌కి చిరంజీవిగారు ఎటువంటి సలహాలు ఇవ్వరని నాకు తెలిసింది. చరణ్ నువ్వు ఇలా చెయ్ అలా చెయొద్దు అని చెప్పరు. ఈ సినిమాలో నీ యాక్టింగ్ బాగుంది, నీ యాక్టింగ్ బాలేదని చెప్పరు.
Rajamouli : రాజమౌళి అలా అనేశాడేంటి?
ఇప్పటి వరకు తను చేసినవన్నీ చరణ్ తన సొంతంగా నేర్చుకున్నాడు.మెగాస్టార్ కొడుకైనా హార్డ్ వర్క్ చేసి ఎదిగాడు. ఇది నాకు కొత్తగా తెలిసింది. ఇలానే ఉండు చరణ్ నువ్వింకా ఎదుగుతావు. ఆయనంత కాకపోయినా తనకు సమానంగా ఉంటావు ఫ్యూచర్‌లో అని నేను కష్చితంగా చెప్పగలనంటూ జక్కన్న పేర్కొన్నాడు. ఇంకా చెప్పాలంటే సి ఒక ఫ్యాన్ గా చిరంజీవి గారి కన్నా ఒక డైరెక్టర్ గా నాకు నా హీరో చరణ్ అంటేనే ఇష్టం. ఇక చిరు గారి లో నచ్చిన మరో లక్షణం కొడుకు పక్కన ఉన్న ఆయనే డామినేట్ చేయాలనే విధానం చాలా చూడముచ్చటగా ఉంటుంది అని తెలియజేశాడు రాజమౌళి.