Samantha : సమంత చిన్మయిని అందుకే దూరం పెట్టిందా..?
Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్‌ను అందుకున్నది. ఆమె చేతిలో ఏకంగా పాన్ ఇండియన్ మూవీస్‌తో పాటు హాలీవుడ్ ప్రాజెక్టు కూడా ఒకటి ఉందని తెలిసింది. ఇక పోతే ఆమె నటించిన శాకుంతలం విడుదలకు సిద్దంగా ఉండగా.. విజయ్‌తో చేస్తున్న ఖుషీ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి తోడు సామ్ బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని చూస్తోంది. అందుకోసం ముంబైలో ఒక ఇంటిని కూడా తీసుకుందట.. సమంత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు తెలుగు రాదు. ఇక సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే సామర్థ్యం ఆమెకు లేదు.
దీంతో సమంత కోసం సింగర్ చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెప్పేది. ఏం మాయ చేశావే మూవీలో చిన్మయి వాయిస్ ఆ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఆమె హస్కీ వాయిస్‌కు కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. ఇక చిన్మయి చాలా కాలం పాటు సామ్ కు డబ్బింగ్ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఒకసారి చిన్మయి సామ్‌కు డబ్బింగ్ చెప్పనని నిర్ణయించుకున్నదట.. ఏమైందో తెలియదు ఆనాడు సామ్ ఏకంగా చిన్మయి ఇంటికి వెళ్లి బతిమిలాడితే అప్పుడు మళ్లీ చిన్మయి డబ్బింగ్ చెప్పేందుకు ఓకే చెప్పిందట.. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. సమంత తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ప్రారంభించింది.

Is that why Samantha kept Chinmayi away
Samantha : సామ్‌కు చిన్మయిపై ఎందుకు కోపం..!
దీంతో చిన్మయి వాయిస్‌ను చాలా మంది మిస్ అవుతున్నారు. సామ్ ఒరిజినల్ వాయిస్ బాలేదని అంటున్నారు. అయితే, ప్రస్తుతం వీరిద్దరు మాట్లాడుకోవడం లేదు. కొంతకాలంగా సామ్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న మూవీస్ కూడా సరిగా ఆడటం లేదు. ఈ నేపథ్యంలోనే యశోద మేకర్స్ మళ్లీ చిన్నయి చేత డబ్బింగ్ చెప్పించాలని అనుకుంటున్నారట.. కానీ దీనికి సమంత ఒప్పుకోవడం లేదని టాక్. వీరిద్దరి మధ్య ఏం జరిగింది.. కారణం ఎమిటన్నది మాత్రం అస్సలు తెలియడం లేదు. కాగా,చైతూ నుంచి విడిపోయాక మాత్రం చిన్మయి సామ్‌కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.