Trisha : సీనియర్ స్టార్ హీరోలు కూడా త్రిష వైపు అందుకే చూడటం లేదా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trisha : సీనియర్ స్టార్ హీరోలు కూడా త్రిష వైపు అందుకే చూడటం లేదా..?

 Authored By govind | The Telugu News | Updated on :15 April 2022,4:30 pm

Trisha : సీనియర్ స్టార్ హీరోలు కూడా త్రిష వైపు అందుకే చూడటం లేదా..? అంటే నెటిజన్స్ చాలా కారణాలే వెతుక్కుంటున్నారు. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త్రిష కృష్ణన్ ఆ తర్వాత వర్షం సినిమాతో ప్రభాస్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అయింది. మొదటి సినిమా అంత పెద్ద సక్సెస్ కాకపోయినా కూడా స్టార్ హీరోయిన్ అవుతుందని మాత్రం అటు తమిళ ఇండస్ట్రీ ఇటు తెలుగు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్దారు.అనుకున్నట్టుగానే త్రిష హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అతికొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఎన్.టి.ఆర్, తరుణ్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో జత కడుతూనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. త్రిష కెరీర్‌లో హిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే, దాదాపు అటు తమిళంలో ఇటు తెలుగులో అందరు హీరోల సరసన నటించింది. పెద్ద దర్శకుల సినిమాలలో నటించి హిట్స్ అందుకుంది. అయితే, గత కొన్నేళ్ళుగా త్రిష సౌత్‌లో పెద్దగా కనిపించడం లేదు.మరీ ముఖ్యంగా తెలుగు తెరపై కనిపించి చాలా ఏళ్ళవుతోంది. వాస్తవంగా అయితే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సింది.

is trisha ignored by senior star heroes

is trisha ignored by senior star heroes

Trisha : త్రిష లాంటి నాజూకు అందాన్ని అభిమానులు మిస్ అవుతున్నారు.

దాదాపు అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వచ్చే సమయంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని కాజల్ వచ్చి చేరింది. ఇప్పుడు నాగార్జున నటిస్తున్న ది ఘోస్ట్‌లో కూడా కాజల్ తప్పుకోవడంతో త్రిష వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ అవకాశం సోనాల్ చౌహాన్ దక్కించుకుంది. అయితే, త్రిష ఇక్కడ అవకాశాలు అందుకోలేకపోవడానికి కారణం, చిరంజీవితో నటించిన స్టాలిన్ ఫ్లాప్‌గా మిగిలింది. అలాగే, పవన్ సరసన నటించిన తీన్‌మార్ ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లోనే చేరింది. బాలయ్యతో చేసిన కూడా ఫ్లాపే. ఇదొక కారణం అయితే, ఆల్రెడీ అందరి సీనియర్ హీరోల సరసన నటించేసింది కాబట్టి కాంబినేషన్ ఫ్రెష్‌గా ఉండదనే ఆలోచన కూడా మేకర్స్‌లో ఉందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా త్రిష లాంటి నాజూకు అందాన్ని అభిమానులు మిస్ అవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది