jabardast : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. తాజాగా ఈ షో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావడంతో అభిమానులు మరియు కమెడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది పది సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది కనుక భారీ ఎత్తున ప్లాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్స్ పారితోషికం అత్యంత తక్కువగా ఉంటుంది అనేది అందరి మాట. కొంత మంది డబ్బులు తీసుకోకుండానే ఫ్రీగా చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే జబర్దస్త్ మంచి గుర్తింపు వారికి ఇస్తుంది. జబర్దస్త్ లో ఫ్రీ గా చేసినా ఆ గుర్తింపుతో బయట నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు అని వాళ్లు భావిస్తున్నారు.
ఫ్రీ గా చేసినా కూడా మంచి గుర్తింపు వస్తుంది కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా జబర్దస్త్ లో ఎంతో మంది కనిపిస్తున్నారు. అమ్మాయిలు కూడా ఉచితంగా వచ్చి నటించేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ కొంత మంది ప్రముఖ కమెడియన్స్ అంటే హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, గెటప్ శీను ఇంకా కొంత మందికి మాత్రం మంచి పారితోషికాలే ఉంటాయి. ఇక జడ్జిగా ఉంటున్నా రోజా పారితోషికం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ షో ను ప్రారంభించినప్పుడు ఒక్కో ఎపిసోడ్ కి రెండు లక్షల చొప్పున రోజా కి పారితోషికంగా ఇచ్చేవారని సమాచారం. ఆ సమయంలో నాగబాబు కి నాలుగు లక్షల వరకు పారితోషికం ఇచ్చేవారట. కాలం మార్పు వస్తుంది.. షో నుండి నాగబాబు వెళ్ళిపోయాడు ఇప్పుడు రోజా మరియు మనో లు మాత్రమే ఈ షోలను నిర్వహిస్తున్నారు.వీరిద్దరి పారితోషకం భారీగానే ఉంటున్నట్లుగా మల్లెమాల వర్గాల నుండి సమాచారం అందుతోంది.
మొన్నటి వరకు ఎనిమిది లక్షల పారితోషికం ఒక్కొక్క ఎపిసోడ్ కు తీసుకున్న రోజా ఇప్పుడు సంవత్సరం గడపడంతో కొత్తగా ఒప్పందం చేసుకోవడం జరిగిందట. 9వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా తన పారితోషికాన్ని 9 లక్షలకు పెంచేసిందనే వార్తలు వస్తున్నాయి. రోజా సంవత్సరం సంవత్సరం అగ్రిమెంట్ సైన్ చేస్తూ ఉంటారని సమాచారం అందుతుంది. ఈ సమయంలో పారితోషకం మినిమం గా పెంచాలని ఒప్పందం ఉంది. కనుక తొమ్మిదేళ్ల తర్వాత పారితోషకం తొమ్మిది లక్షలు గా మారింది. వచ్చే ఏడాదిలో జబర్దస్త్ షో దశాబ్ద కాలం పూర్తి చేసుకుంటుంది. దాంతో కచ్చితంగా ఆమె పారితోషికం పది లక్షలకు పైగా పెరుగుతుందని అంటున్నారు. ఇంతగా భారీ పారితోషికం ఇవ్వడం వల్లనే ఆమె ఎమ్మెల్యే అయినా కూడా ఈ షో ను వదిలేయడం లేదు. భవిష్యత్ లో మంత్రి అయినా కూడా ఈమె ఈ షో ను కొనసాగించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.