Jabardast : జబర్దస్త్‌ కి 9 ఏళ్లు.. ఈ సందర్బంగా రోజా పారితోషికం మళ్లీ పెరిగింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardast : జబర్దస్త్‌ కి 9 ఏళ్లు.. ఈ సందర్బంగా రోజా పారితోషికం మళ్లీ పెరిగింది

 Authored By himanshi | The Telugu News | Updated on :28 February 2022,7:40 am

jabardast : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. తాజాగా ఈ షో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావడంతో అభిమానులు మరియు కమెడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది పది సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది కనుక భారీ ఎత్తున ప్లాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్స్‌ పారితోషికం అత్యంత తక్కువగా ఉంటుంది అనేది అందరి మాట. కొంత మంది డబ్బులు తీసుకోకుండానే ఫ్రీగా చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే జబర్దస్త్ మంచి గుర్తింపు వారికి ఇస్తుంది. జబర్దస్త్ లో ఫ్రీ గా చేసినా ఆ గుర్తింపుతో బయట నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు అని వాళ్లు భావిస్తున్నారు.

ఫ్రీ గా చేసినా కూడా మంచి గుర్తింపు వస్తుంది కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా జబర్దస్త్ లో ఎంతో మంది కనిపిస్తున్నారు. అమ్మాయిలు కూడా ఉచితంగా వచ్చి నటించేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ కొంత మంది ప్రముఖ కమెడియన్స్‌ అంటే హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, గెటప్ శీను ఇంకా కొంత మందికి మాత్రం మంచి పారితోషికాలే ఉంటాయి. ఇక జడ్జిగా ఉంటున్నా రోజా పారితోషికం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ షో ను ప్రారంభించినప్పుడు ఒక్కో ఎపిసోడ్ కి రెండు లక్షల చొప్పున రోజా కి పారితోషికంగా ఇచ్చేవారని సమాచారం. ఆ సమయంలో నాగబాబు కి నాలుగు లక్షల వరకు పారితోషికం ఇచ్చేవారట. కాలం మార్పు వస్తుంది.. షో నుండి నాగబాబు వెళ్ళిపోయాడు ఇప్పుడు రోజా మరియు మనో లు మాత్రమే ఈ షోలను నిర్వహిస్తున్నారు.వీరిద్దరి పారితోషకం భారీగానే ఉంటున్నట్లుగా మల్లెమాల వర్గాల నుండి సమాచారం అందుతోంది.

jabardast after 9 years completed roja remuneration hike

jabardast after 9 years completed roja remuneration hike

మొన్నటి వరకు ఎనిమిది లక్షల పారితోషికం ఒక్కొక్క ఎపిసోడ్ కు తీసుకున్న రోజా ఇప్పుడు సంవత్సరం గడపడంతో కొత్తగా ఒప్పందం చేసుకోవడం జరిగిందట. 9వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా తన పారితోషికాన్ని 9 లక్షలకు పెంచేసిందనే వార్తలు వస్తున్నాయి. రోజా సంవత్సరం సంవత్సరం అగ్రిమెంట్ సైన్ చేస్తూ ఉంటారని సమాచారం అందుతుంది. ఈ సమయంలో పారితోషకం మినిమం గా పెంచాలని ఒప్పందం ఉంది. కనుక తొమ్మిదేళ్ల తర్వాత పారితోషకం తొమ్మిది లక్షలు గా మారింది. వచ్చే ఏడాదిలో జబర్దస్త్ షో దశాబ్ద కాలం పూర్తి చేసుకుంటుంది. దాంతో కచ్చితంగా ఆమె పారితోషికం పది లక్షలకు పైగా పెరుగుతుందని అంటున్నారు. ఇంతగా భారీ పారితోషికం ఇవ్వడం వల్లనే ఆమె ఎమ్మెల్యే అయినా కూడా ఈ షో ను వదిలేయడం లేదు. భవిష్యత్‌ లో మంత్రి అయినా కూడా ఈమె ఈ షో ను కొనసాగించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది