
sravanthi chokarapu comments on Nagarjuna
Nagarjuna : బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడా ఎన్నడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీ కార్యక్రమం రీసెంట్‌గా లాంచ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24*7 నాన్ స్టాప్‌గా ఈ షో ప్రసారం అవుతోంది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. ఈ షోని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేయోచ్చు. ఓటీటీ షోలో గత సీజన్లకి సంబంధించిన కంటెస్టెంట్ లు వారియర్స్ గా, కొత్తగా వచ్చే వారు చాలెంజర్స్ గా పిలవబడతారు అంటూ నాగార్జున ప్రకటించారు. అందులో భాగంగా మొదట అషు రెడ్డి, ఆ తర్వాత మహేష్ విట్టా, ఆ తర్వాత ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇవ్వగా నాలుగో హౌస్ మేట్ గా అజయ్ కుమార్ కతుర్వార్ అనే హీరో ఎంట్రీ ఇచ్చాడు.
అనంతరం మరో చాలెంజర్ గా యాంకర్ స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది. ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో అడపాదడపా మెరుస్తుంటుంది. కాని అంతగా పరిచయం లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి చాలా సుపరిచితం. అయితే బిగ్ బాస్ ఓటీటీ స్టేజ్ మీద అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పెద్ద షాక్ ఇచ్చింది. తనకు వివాహం జరిగిందనే విషయాన్ని నాగార్జునతో పాటు వేదిక మీద ఉండగానే ప్రకటించింది. నీ గురించి ప్రపంచానికి తెలియని విషయం ఏదైనా చెప్పమని నాగార్జున అడిగితే తనకు రెండు సార్లు వివాహం అయిందని చెప్పుకొచ్చింది.
sravanthi chokarapu comments on Nagarjuna
అదేమిటి అని అడిగితే తాను ప్రేమించి పారిపోయి ఒకసారి పెళ్లి చేసుకున్నామని ఒప్పుకున్న తర్వాత మరోసారి వివాహం జరిగిందని ఆమె పేర్కొంది.తనకు పెళ్లైన విషయం చాలా మందికి తెలియదని స్రవంతి పేర్కొంది. తాను అనంతపురం జిల్లా కదిరి అని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయిని అని ఆ అబ్బాయి మాత్రం తెలంగాణ అబ్బాయి అని చెప్పుకొచ్చింది. నేను నచ్చక పోవడం కాదు కానీ కులాలు వేరు కావడంతో మొదటి వివాహం చేయడానికి ఇబ్బంది పడ్డారు కానీ వాళ్ల ఇంటి పేరుని సగర్వంగా చెప్పుకునే విధంగా చేయడంలో తాను గర్వపడుతున్నానని అని ఆమె చెప్పుకొచ్చింది.
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
This website uses cookies.