Anasuya : అనసూయ సినిమాల్లో నటిస్తే తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 7 May 2022, 6:32 pm

Anasuya : ఈటీవీలో జబర్దస్త్‌ కామెడీ షో ప్రారంభం అయ్యి దాదాపుగా 9 ఏళ్లు కావస్తుంది. జబర్దస్త్‌ కు ముందు అనసూయ ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు. ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా కూడా ఆమె గురించి జనాల్లో పెద్దగా అవగాహణ లేదు. కాని ఎప్పుడైతే జబర్దస్త్‌ ద్వారా జనాల మద్యకు వచ్చిందో అప్పుడే ఆమె స్థాయి పెరిగింది. అప్పటికే ఆమె పెళ్లి అయ్యి ఒక బాబుకు తల్లిగా కూడా ఉందనే విషయం తెల్సిందే.హీరోయిన్ గా నటించే స్థాయి ఉన్న యాంకర్‌ అంటూ అనసూయ గురించి ప్రశంసలు కురిపించిన వారు చాలా మంది ఉన్నారు.

నటిగా ఆమె స్థాయి అమాంతం పెంచే విధంగా జబర్దస్త్‌ కార్యక్రమం నిలిచింది. జబర్దస్త్‌ తర్వాత రెండవ డెలవరీ కారణంగా చిన్న బ్రేక్ తీసుకుంది. ఆ బ్రేక్ సమయంలో రష్మి ఎంట్రీ ఇచ్చింది. దాంతో అనసూయకు జబర్దస్త్‌ మళ్లీ దక్కదు అనుకున్నారు. కాని జబర్దస్త్‌ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్‌ అంటూ రెండు తీసుకు వచ్చి ఒక దానికి మళ్లీ అనసూయను యాంకర్ గా చేశారు.జబర్దస్త్‌ పుణ్యాన అనసూయ స్టార్‌ హీరోయిన్ రేంజ్‌ లో గుర్తింపు దక్కించుకుంది. తెలుగు లో ఈమె వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది.

jabardasth Anasuya movies remunerations

jabardasth Anasuya movies remunerations

ఈమె కనుక సినిమాల్లో నటించేందుకు గేట్లు ఎత్తేసినట్లుగా అన్ని సినిమాలకు ఓకే చెప్తే ఒకే సారి పది పదిహేను ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా హీరోయిన్‌ గా కూడా ఆఫర్లు వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు అనసూయ భారీ పారితోషికం అందుకుంటుంది. నటిగా ఆమె ఒక్క రోజు కాల్షీటు ఖరీదు 5 నుండి 6.5 లక్షల వరకు ఉందట. పది రోజుల పాటు ఒక సినిమాకు డేట్లు కేటాయిస్తే 50 లక్షలకు పైగానే ఆమె పారితోషికంను డిమాండ్ చేస్తుందట. పుష్ప సినిమాకు గాను ఆమె వర్క్ చేసింది కొన్ని రోజులే అయినా కూడా ఏకంగా 40 లక్షల పారితోషికంను అందుకుందని తెలుస్తోంది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి