Hyper Aadi : జబర్దస్త్‌.. హైపర్ ఆది మరో ప్రయోగం, ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: March 7, 2022, 8:00 pm

Hyper Aadi : జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్క్రిప్టులను చేస్తూ.. విభిన్నమైన కామెడీని చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. హైపర్ ఆది స్కిట్ అంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో మంది టీం లీడర్లు ఉన్నా.. ఎన్నో టీం లు ఉన్నా హైపర్ ఆది టీం కి వారు సరిపడరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరెంట్ అఫైర్స్ మీద, తన టీం సభ్యుల మీద ఎప్పటికప్పుడు పంచ్‌ లు వేస్తూ నవ్విస్తాడు.ఈమద్య కాలంలో తన స్కిట్ లో కామెడీని కొత్తగా చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇటీవల ఆయన రోజా నగరి ఇంటి హోమ్ టూర్ ని చేయడం జరిగింది.

ఆ టూర్ కు మంచి స్పందన వచ్చింది. కేవలం అందులో ఇంటిని మాత్రమే చూపించకుండా కాకుండా మంచి కామెడీ కూడా పండించింది అనడంలో సందేహం లేదు. ఈ సారి మరో తరహా జబర్దస్త్ కామెడీ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ఆది సిద్ధమయ్యాడు.హైపర్ ఆది ఈ వారం స్కిట్ తన గృహ ప్రవేశం ఎపిసోడ్ ని ఎంపికచేసుకున్నాడు. ఆ ఎపిసోడ్ లో తన టీం సభ్యులు అందరూ వారి వారి కుటుంబ సభ్యులను తీసుకు వచ్చేలా చేశాడు. తద్వారా జబర్దస్త్ టీమ్ మెంబర్స్ వారి కుటుంబ సభ్యులను పరిచయం చేయడం తో వారి వారి కుటుంబ సభ్యులతోనే వారి పై పంచులు వేయించి అనూహ్యంగా కామెడీ చేయించాడు.

jabardast comedy show Hyper Aadi latest episode promo

jabardast comedy show Hyper Aadi latest episode promo

దొరబాబు తన బ్రదర్స్ గురించి పరిచయం చేస్తూ.. మేము ముగ్గురం కలిసి ఉంటామంటూ, కలిసే ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము అంటాడు. అప్పుడు వెంటనే ఆయన బ్రదర్‌ అక్కడికి మాత్రం కలిసి వెళ్లలేదు అనేసారు. ఇలా ప్రతి ఒక్క కమెడియన్‌ పై వారి ఫ్యామిలీ మెంబర్స్ వేసిన పంచ్ లు చేసిన సందడితో హైపర్ ఆది స్కిట్ మరో సారి హైలెట్ అవ్వబోతుంది. ఈ వారం టెలికాస్ట్ కాబోతున్న ఈ జబర్దస్త్ స్కిట్ కోసం ఇప్పటి నుండే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. హైపర్ ఆది స్కిట్ అంటే ఇప్పుడు కూడా చాలా సందడిగా ఉంటుంది ఈ సారి అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp