Home » Entertainment » Jabardast Wants To New Anchor Sowmya Rao
Entertainment

Sowmya Rao : ఎవరు ఈ సౌమ్యరావు .. జబర్దస్త్ కొత్త యాంకర్ గా ఈ అమ్మాయే కావాలి అని పట్టుబడుతోంది !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 6, 2022 4:03 pm
Advertisement

Sowmya Rao : బుల్లితెరలో ఫుల్ క్రేజ్ ఉన్న షో జబర్దస్త్. ఈమధ్య జబర్దస్త్ లోకి చాలా మార్పులు కనిపిస్తున్నాయి. జబర్దస్త్ యాంకర్ అనసూయ ఈ మధ్యనే షో మానేసింది. ఆ షో వల్ల ఆమెకు ఎంత క్రేజ్ వచ్చిందో అన్నది అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా జబర్దస్త్ కి కొత్త యాంకర్ ని పరిచయం చేసింది మల్లెమాల టీమ్. జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరో కాదు సౌమ్యారావు. కన్నడ తమిళ సీరియల్స్ లో నటిస్తూ తెలుగులో కూడా ఒక సీరియల్ చేస్తున్న అమ్మడిని జబర్దస్త్ కి యాంకర్ గా తీసుకొచ్చారు. నటన మీద ఆసక్తి ఉన్న సౌమ్య కన్నడ టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టి జీ కన్నడ టీవీలో పట్టేదారి ప్రతిభ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.

Advertisement

ఆ సీరియల్ హిట్ అవడంతో ఆమెతో తమిళ సీరియల్స్ ఆఫర్లు ఇచ్చారు. తమిళంలో సన్ టీవీలో రోజా సీరియల్ లో సాక్షి పాత్రలో నటించింది. అలాగే తమిళ సీరియల్ నెంజాం మరప్పతల్లై లో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించింది. సౌమ్యరావు ఈటీవీలో శ్రీమంతుడు సీరియల్ లో నటిస్తుంది. ఆమె టాలెంట్ గుర్తించేలా చేసింది ఈటీవీ స్పెషల్ ఎపిసోడ్. ఈ మధ్యనే పండుగ సందర్భంగా టీవీ యాక్ట్రెస్లతో జబర్దస్త్ కమెడియన్స్ షో ఒకటి చేశారు. అందులో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ పంచులకు రివర్స్ పంచులు వేస్తూ హైలైట్ అయింది సౌమ్యరావు.

jabardasth wants to new anchor Sowmya Rao

Advertisement

ఆ సమయంలోనే మల్లెమాల టీం కి సౌమ్య యాంకర్ గా పర్ఫెక్ట్ అని అనిపించింది. వెంటనే ఆమెను సంప్రదించి డీల్ ఓకే చేసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అనసూయ ప్లేస్ లో కొత్త యాంకర్ సౌమ్య రావు వచ్చి షోకి కొత్త కలర్ తెచ్చిందని చెప్పవచ్చు. ఇక యాంకర్ ఎవరైనా సరే పులిహోర కలపడం ఆదికి అలవాటే‌ అందుకే ఆమె రావడం ఆలస్యం హైపర్ ఆది సౌమ్యరావుని పడేయాలని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. మరి జబర్దస్త్ కి కొత్త యాంకర్ సౌమ్యరావు వలన జబర్దస్త్ షో కి ఎటువంటి సక్సెస్ వస్తుందో వేచి చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి