Home » Entertainment » Jabardasth Avinash Got Engaged With Anuja
Entertainment

Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్‌ నిశ్చితార్థం.. ఇది కూడా పబ్లిసింటి స్టంటేనా..వీడియో ?

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 1, 2021, 9:08 am
Advertisement

Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్ పెళ్లి గోల బిగ్ బాస్ ఇంటి నుంచి మొదలైంది. బిగ్ బాస్ షోలో పదే పదే పెళ్లి గురించి అవినాష్ మాట్లాడటం జరిగింది. అందులోనూ అవినాష్ తల్లి కూడా పెళ్లి గురించి మాట్లాడింది. బయటకు రా బిడ్డ.. వచ్చిన తరువాత చూస్తా అని చెప్పుకొచ్చింది. అలా అవినాష్ ఎక్కడికి వెళ్లినా, ఏ ఈవెంట్ చేసినా కూడాపెళ్లి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా అవినాష్ పెళ్లి ఘడియల గురించి చెప్పేశాడు. తనకు నిశ్చితార్థం అయిందని ప్రకటించాడు.

Advertisement

Jabardasth Avinash Got Engaged With Anuja

 

Advertisement

జబర్దస్త్ అవినాష్‌ నిశ్చితార్థం.. ఇది కూడా పబ్లిసింటి స్టంటేనా? Jabardasth Avinash

వినాయక చవితికి స్టార్ మాలో పండుగే పండుగ అనే ఈవెంట్ రాబోతోంది. ఇందులో భాగంగా అవినాష్ తనకు కాబోయే భార్యను చూపించాడు. అక్కడే అందరి ముందే రింగులు తొడిగేసుకున్నారు. ఆమె పేరు అనూజ అని చెప్పేశాడు. అక్కడితో ఆగకుండా అవినాష్ స్పెషల్‌గా ఓ పోస్ట్ చేశాడు. అనూజ అవినాష్ ఎంగేజ్మెంట్ అయింది. ఎప్పుడైతే కరెక్ట్ మనిషి దొరుకుతారో.. ఇక ఎదురుచూపులకు తెరదించినట్టు అవుతుంది.

Jabardasth Avinash Got Engaged With Anuja

Advertisement

 

మా ఫ్యామిలీలు కలిశాయ్.. మేం కూడా కలిసిపోయాం. చిన్నగా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. మీరంతా నా పెళ్లి ఎప్పుడు అని అడుగుతూ వచ్చారు. అతి త్వరలో నా అనూజ తో. సారీ మీ అనూజ అవినాష్. అంటూ పోస్ట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే మళ్లీ పబ్లిసిటీ స్టంట్ లాంటిదేమో అనిపిస్తోంది. గతంలో పునర్నవి, జబర్దస్త్ వర్ష ఇలానే పెళ్లి, నిశ్చితార్థం అంటూ నాటకాలు ఆడి.. తమ షోలకు ప్రమోషన్‌లు కల్పించుకున్నారు. అలా ఇప్పుడు అవినాష్ కూడా చేస్తున్నాడా? లేక ఇది నిజమైన ఎంగేజ్మెంటా? అని అనుమానం కలుగుతోంది. అసలు కథ త్వరలోనే బయటపడనుంది.

Jabardasth Avinash Got Engaged With Anuja

 

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి