Huzurabad bypoll తెలంగాణలో ఉప ఎన్నిక కోసం సిద్ధంగా ఉన్న హుజూరాబాద్‌లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై అందరి దృష్టి నెలకొంది. నిజానికి ఆగస్టులోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నిక నిర్వహణపై ఈ నెల 28న అభిప్రాయాలు సేకరించింది. దీంతో సెప్టెంబర్‌లో హుజూరాబాద్ నగారా మోగే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికను నిర్వహించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక టీఆర్ఎస్ సైతం సెప్టెంబర్‌లోనే ఉప ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో ఉంది.
అంతర్గతంగా తమ పార్టీ శ్రేణులను ఈ మేరకు సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు అక్కడ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన తీరుపై ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు హుజూరాబాద్‌లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయనే దానిపై క్షేత్రస్థాయి నుంచి వివిధ వర్గాల ద్వారా సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నారని.. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక సెప్టెంబర్‌లో జరుగుతుందన్న టీఆర్ఎస్, బీజేపీ ఆలోచన వెనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మార్చి 28న చనిపోయారు. సెప్టెంబర్ 28 నాటికి ఆయన చనిపోయి ఆరు నెలలు పూర్తి కానుంది. నిబంధనల ప్రకారం శాసనసభ్యుడు మరణించినా లేక రాజీనామా చేసినా ఆరు నెలల్లో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణను కేంద్ర ఎన్నిక సంఘం వాయిదా వేస్తూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతుండటంతో.. కేంద్రం ఉప ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చేమో అనే చర్చ జరుగుతోంది.
అదే జరిగితే ఏపీలోని బద్వేలు స్థానంతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని తెలంగాణ రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏపీలోని బద్వేలు నియోజకవర్గంతో పాటే తెలంగాణలోని హుజూరాబాద్‌కు కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ శ్రేణులకు సంకేతాలు కూడా పంపినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చని.. అంతా సిద్ధంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.
మరోవైపు హుజూరాబాద్‌లో గెలిచి టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఒక్కరే ప్రచారంలో దూసుకుపోతున్నా.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలోని బీజేపీ నేతలతో పాటు జాతీయ నేతలు కూడా ప్రచారం పర్వంలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.
ఈమేరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా హుజూరాబాద్ లోనే ముగించేందుకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తానికి సెప్టెంబర్‌లో అయినా హుజూరాబాద్ ఉపఎన్నికకు నగారా మోగుతుందా లేక ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం మరికొంత సమయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.