Jabardasth Avinash : నవ్యస్వామి రవికృష్ణలు అడ్డంగా బుక్కయ్యారు.. పరువుతీసిన అవినాష్

 Authored By prabhas | The Telugu News | Updated on :30 July 2022,6:40 pm

Jabardasth Avinash : నవ్యస్వామి రవికృష్ణ జోడికి బుల్లితెరపై ఉన్న డిమాండ్ అండ్ క్రేజ్ అందరికీ తెలిసిందే. స్టార్ మా సీరియల్‌లో ప్రసారమైన ఆమె కథ సీరియల్‌తో ఈ జోడి పాపులర్ అయింది. అంతకు ముందు నవ్యస్వామి, రవికృష్ణలకు అంతగా పరిచయం ఉండేది కాదు. ఆమె తన సీరియల్స్‌తో బిజీగా ఉండేది. అతగాడు బిగ్ బాస్ షోతో వచ్చిన క్రేజ్‌తో దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో ఈ సీరియల్ వచ్చింది. ఈ జోడి ఒక్క చోటకు వచ్చింది. ఆ సీరియల్ బాగానే క్లిక్ అవ్వడంతో ఈ జోడి రొమాన్స్ మరింతగా ముదిరింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో ఈ జోడి రొమాన్స్ అదిరిపోయింది. ఇక ఈ ఇద్దరికీ ఒకే సారి కరోనా రావడంతో అందరి దృష్టిలో పడిపోయారు.

ఫస్ట్ వేవ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా బారిన పడ్డది వీరే అనుకుంటా. అలా మొత్తానికి ఈ ఇద్దరూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. మొదటి సారిగా క్యాష్ షోలోకి వచ్చినప్పుడు వీరు చేసిన రొమాన్స్, హగ్స్, కిస్సులతో మరింతగా పాపులర్ అయ్యారు. అలా మొత్తానికి ఈ జోడికి స్క్రీన్ మీద మంచి పేరు వచ్చింది. ఇక ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారనే రూమర్లు స్టార్ట్ అయ్యాయి. వాటిని వారిద్దరూ కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. ఆ తరువాత వాటిని సున్నితంగా ఖండిస్తూ వస్తున్నారు. కానీ నవ్యస్వామి పోస్టులకు రవికృష్ణ పెట్టే కామెంట్లు చూస్తుంటే ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది.

Jabardasth Avinash Satires on Navya Swamy And Ravikrishna

Jabardasth Avinash Satires on Navya Swamy And Ravikrishna

మొత్తానికి ఈ జోడి మాత్రం ఈటీవీ, స్టార్ మా అంటూ బాగానే మ్యానేజ్ చేస్తోంది. ఈటీవీలో ఢీ షో చేస్తోంది. మధ్యమధ్యలో పండుగ ఈవెంట్లలోనూ పాల్గొంటుంది. మరో వైపు స్టార్ మా ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది ఈ జోడి. ఇదే విషయాన్ని తాజాగా అవినాష్ స్టేజ్ మీద అనేశాడు. ఈ వర్షం సాక్షిగా అంటూ చేసిన ఈ ఈవెంట్‌లో సీరియల్, రియల్ జంటలు వచ్చారు. హనీమూన్ ఫ్రీ ట్రిప్ వస్తుందని ఒక్కొక్కరు రెచ్చిపోయారు. అయితే మాటల్లో భాగంగా.. ఈ బస్సు దేశాల్ని దాటిస్తుందా? అని రవి అంటాడు. మీ జోడి చానెళ్లలను దాటేస్తున్నారు కదా? అని అందరి ముందు బుక్ చేస్తాడు. ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు.. ఎవరు వస్తారో రారో గానీ రవికృష్ణ వస్తాడని ముందే అనుకున్నా అని అవినాష్ అందరి ముందు పరువుతీసేస్తుంటాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి