Jabardasth Avinash : గతాన్ని గుర్తు చేసిన ఓంకార్.. కన్నీరు పెట్టుకుని మోకరిల్లిన అవినాష్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 17, 2022, 8:00 pm

Jabardasth Avinash : కమెడియన్ అవినాష్, జబర్దస్త్ అవినాష్, ముక్కు అవినాష్, బిగ్ బాస్ అవినాష్ ఇలా అవినాష్‌కు చాలా పేర్లే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువగా పేరు తెచ్చింది.. ఒకడంటూ ఉన్నాడని ప్రపంచానికి తెలిసేలా చేసింది మాత్రం జబర్దస్త్ షోనే. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చి.. బిగ్ బాస్ షోకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో అవినాష్ అగ్రిమెంట్ అడ్డు వచ్చింది.మల్లెమాల అగ్రిమెంట్ రద్దు చేయాలంటే పది లక్షలు కట్టాల్సి ఉంటుంది.

దీంతో అవినాష్ ఆ డబ్బును శ్రీముఖి వద్ద అప్పుగా తీసుకున్నాడు. మొత్తానికి అవినాష్ మాత్రం ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ షోలోకి వచ్చాడు. అక్కడ పదే పదే కూడా ఈ అగ్రిమెంట్ గురించి చెప్పడం, తన కష్టాలు వివరించడం, లాక్డౌన్‌‌లో సూసైడ్ చేసుకోవాలనుకున్నానంటూ చెప్పడం అందరికీ తెలిసిందే.కరోనా, లాక్డౌన్ వంటివి వస్తాయ్.. షోలు రద్దు అవుతాయ్.. షూటింగ్‌లు ఉండవు అని ఆలోచించని అవినాష్.. అప్పు తెచ్చి, బ్యాంకు లోని తీసుకుని ఇంటిని కట్టేశాడు.

Jabardasth Avinash Gets Emeotional In Ishmart Jodi 2

Jabardasth Avinash Gets Emeotional In Ishmart Jodi 2

దీంతో సమస్య మొదలైంది. మొత్తానికి బిగ్ బాస్ షో ద్వారా 50 లక్షలు సంపాదించేశాడు. దాంతో అప్పులన్నీ తీరిపోయాయ్. మళ్లీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేశాడు. స్టార్ మాలోనే కామెడీ స్టార్స్ అంటూ చేసుకుంటూ వస్తున్నాడు.ఇదే విషయాన్ని తాజాగా ఇస్మార్ట్ జోడిలో అవినాష్‌ గుర్తు చేసుకున్నాడు. అవినాష్ చాలా గ్రేట్ అంటూ ఓంకార్ అన్ని విషయాలను గుర్తు చేశాడు. దీంతో కంటతడి పెట్టేసిన అవినాష్.. నాకు స్టార్ మానే కొత్త జీవితాన్ని ఇచ్చిందంటూ మోకాళ్ల మీద పడిపోయాడు. కన్నీరు పెట్టేసుకున్నాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp