Jabardasth Avinash : అవినాష్ మళ్లీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట… కన్నీళ్లు పెట్టించే వీడియో
Jabardasth Avinash : జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్న ముక్కు అవినాష్ అనూహ్యంగా జబర్దస్త్ వీడి స్టార్ మా లో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయం లో ముక్కు అవినాష్ కి మంచి ఎంటర్టైనర్ గా పేరు దక్కింది. ఆ సీజన్లో ముక్కు అవినాష్ కచ్చితంగా టాప్లో నిలుస్తాడని అంతా భావించారు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ మధ్యలోనే బయటకు వచ్చేశాడు. హౌస్లో ఏదైనా గొడవ జరిగినా లేదంటే నామినేషన్స్ జరిగిన సానుభూతి కోసం తాను ఆత్మహత్య ప్రయత్నం చేశానని ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని స్నేహితులు మరియు సన్నిధిలో సహకారంతోనే తాను బతికి బట్ట కట్టాలంటే చెప్పుకొచ్చేవాడు.
ఆ సమయంలో ముక్కు అవినాష్ యొక్క మాటలు వైరల్ అయ్యాయి. ఆయనను చాలా మంది గౌరవిస్తూ మద్దతుగా నిలిచేందుకు ముందు కొచ్చారు. ఇప్పుడు ముక్కు అవినాష్ పరిస్థితి బాగానే ఉంది. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కూడా నిలిచింది. ఆయన ప్రస్తుతం ఓంకార్ ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలని భావించా అంటూ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు.గతంలో బిగ్ బాస్ వంటి అతి పెద్ద వేదిక మీద ముక్కు అవినాష్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే ఆ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి గుర్తు ఉన్నాయి.

Jabardasth Avinash again emotional speech in ismort jodi
ఇప్పుడు మళ్ళీ అవే వ్యాఖ్యలను ముక్కు అవినాష్ చేయడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఆత్మహత్య చేసుకోవాలని భావించాను అంటూ చేసిన వ్యాఖ్యలను జనాలు ఇంకా మర్చి పోలేదు, మళ్ళీ ఈ షోలో ఆ వ్యాఖ్యలు ఆ సంఘటనలు గుర్తు చేసుకోవడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో బుల్లి తెర ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇలా చెప్పడం వల్ల సానుభూతి వస్తుందని మీరు భావిస్తున్నారా ఏమో అంటూ కొందరు ముక్కు అవినాష్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
