Jabardasth : తండ్రి కాబోతోన్న జబర్దస్త్ లేడీ గెటప్ ఆర్టిస్ట్.. షోలో అలా చేయడంతో వినోదిని కంటతడి

Authored By Sam C | The Telugu News | Published on: February 23, 2022, 8:20 am

Jabardasth : జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోతో ఎంతో మంది ఆర్టిస్ట్‌లు లైమ్ లైట్‌లోకి వ‌చ్చారు. ఇప్పుడు వారు సెల‌బ్రిటీలుగా చ‌లామ‌ణి అవుతున్నారు.అంతేకాదు సొంత ఇల్లు, కారు కొనుక్కొని సెటిల్ అయ్యారు. అయితే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ వినోద్ ఒకరు. ముఖ్యంగా లేడీ గెట‌ప్స్ లో చమ్మక్ చంద్ర స్కిట్లలో వినోద్ చేసే పర్‌ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. జబర్ధస్త్ షోలోనే కాకుండా బయట జరిగే ఈవెంట్లకు కూడా ఆడవేషాలతోనే వెళ్తుంటాడు. దీంతో అతడికి ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వినోద్ తన భార్య విజయతో కలిసి బుల్లితెరపై ప్రసారమవుతున్న క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వినోద్ తో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా హాజరయ్యారు.జబర్దస్త్ వినోద్ తన భార్య విజయతో ఈ కార్యక్రమానికి హాజరు కాగా, ఈ షోలో విజ‌య‌కు శ్రీమంతం వేడుక నిర్వ‌హించారు. ఇక సుమ తన భార్య విజయకు శ్రీమంతం చేయడంతో ఒక్కసారిగా విజయ, వినోద ఇద్దరు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ రీసెంట్ గానే తనకు తన నాన్న చనిపోయారని అయితే నాన్న చనిపోయినప్పుడు తనకు తోడుగా ఎవరూ లేరని వినోద్ ఈ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సన్నివేశాలు తాజాగా విడుదలైన `క్యాష్‌` లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలోని సన్నివేశాలు. విడుదలైన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతూ, అభిమానులను అలరిస్తుంది.

jabardasth comedian gets father promotion

jabardasth comedian gets father promotion

Jabardasth : సుమ కాళ్లు మొక్కిన వినోద్..

ప్రోమోలో సుమ మాట్లాడుతూ.. నీకు కనుక మీ అమ్మ ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు శ్రీమంతం చేసేది కదా ఇక మేమే మీ అమ్మ అనుకో అంటూ తనకు శ్రీమంతం చేసి తన బాధను మొత్తం పోగొట్టినట్లు తెలుస్తోంది.ఇలా తన భార్యకు తల్లి స్థానంలో సుమ శ్రీమంతం చేయడంతో వినోద్ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ షోలో జ‌బ‌ర్ధ‌స్త్ వినోద్ తో పాటు పవన్‌, తన్మయి, హరికృష్ణ కూడా పాల్గొన్నారు. హరికృష్ణ కూడా తన భార్యతో పాల్గొనగా, పవన్‌, ట్రాన్స్ జెండర్‌ తన్మయి తమ మదర్స్ తో షోలో పాల్గొన సందడి చేశారు. తమదైన కామెడీతో నవ్వించారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp