Sitara : మ‌హేష్ కూతురిలో ఇన్ని క‌ళ‌లు ఉన్నాయా.. చిన్నారి మాముల్ధి కాదు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :22 February 2022,10:00 pm

Sitara : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టీవ్‏గా ఉంటుంది. వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌తో క‌లిసి ప‌లు వీడియోలు చేసి ర‌చ్చ‌చేసింది సితార. అంతేకాకుండా తనకు నచ్చిన పాటకు స్టెప్పులెస్తున్న వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సితారకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కేవలం మాటలతోనే కాకుండా.. తనలోని డ్యాన్సింగ్ టాలెంట్.. పెయింటింగ్.. సింగింగ్ టాలెంట్‏తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. సితార తాజాగా తండ్రి, మహేశ్‌ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్‌ స్టెప్పులేసి మెస్మరైజ్‌ చేసింది.

సితార స్ట‌న్నిండ్ డ్యాన్స్‌కి మ‌హేష్ స్పందించాడు. ‘మై స్టార్.. నన్ను బీట్ చేసింది’ అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు. మహేశ్‌ భార్య నమ్రత సైతం ఇంకేం చెప్పగలను? లవ్‌యూ మై లిటిల్‌ వన్‌ అని పేర్కొంది. ఇక సితార డ్యాన్స్‌కు మహేశ్‌ అభిమానులు సహా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అచ్చం నాన్నలాగే సూపర్‌స్టార్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సితార డ్యాన్స్ వీడియో వైర‌ల్ కాగా, ఇప్పుడు సితార త‌న‌లో దాగి ఉన్న మ‌రో టాలెంట్ గురించి చూపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.త‌న ఫ్రెండ్ మోహ‌న‌తో క‌లిసి ప్రకృతికి సంబంధించిన పెయింటింగ్ వేసింది. ఇది చూసిన న‌మ్ర‌త చాలా హ్యాపీగా ఫీలైంది.

sitara shows her inner talent

sitara shows her inner talent

Sitara : సితారానా, మ‌జాకానా..!

ఇక నెటిజ‌న్స్ అయితే సితార టాలెంట్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చాలా అందంగా వేశావు అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా, సితార తండ్రి న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి రీసెంట్‌గా ‘కళావతి’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాటలో మహేష్ బాబు, కీర్తి సురేష్ గ్రేస్ హైలైట్ కావడంతో ఆన్ లైన్ వేదికలపై పలు రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన క‌ళావ‌తి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మహేష్ మరింత హ్యాండ్సమ్ అండ్ స్టైలీష్ లుక్‏తో కనిపించాడు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి