Jabardasth Comedians : ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఎంతో మంది కమెడియన్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. వారు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తే అందులో కూడా పాల్గొని ఈటీవీ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం పరిపాటిగా వస్తుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన స్పెషల్ కార్యక్రమంలో జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క కమెడియన్స్ సందడి చేశారు. ఎప్పటిలాగే కార్యక్రమానికి మంచి రేటింగ్ వచ్చింది. యాంకర్ గా ప్రదీప్ వ్యవహరించగా పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది.
ఇక గతంలో ఒకసారి వర్ష మరియు ఇమాన్యుల్ లు రోడ్ల మీద తిరుగుతూ అడుక్కునే వారిగా నటించి ప్రేక్షకులకు వినోదాన్ని పండించారు. ఇప్పుడు అదే తరహాలో బుల్లెట్ భాస్కర్ టీం రోడ్ల మీద తిరుగుతూ అడుక్కునే వారిగా కనిపించారు. వారిని ఏ ఒక్కరు గుర్తు పట్టకుండా పూర్తిగా అడుక్కునే వారి గెటప్ లో మారిపోయారు. రోడ్ల మీద తిరుగుతూ వాహనదారులను ఇబ్బంది పెడుతూ వారు నవ్వులు పూజించారు. కానీ ఈ స్కిట్ చాలా మందికి నచ్చడం లేదు. కొందరు రోడ్ల మీద అడుక్కునే వాళ్లను అవమానించినట్లే అంటూ విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం ఇదెక్కడి విడ్డూరమంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
రోడ్ల మీద పడి ఇలా అడుక్కోవడం ఏంట్రా బాబు అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వినోదం పండించేందుకు వీరు చేస్తున్న ప్రయత్నం నిజంగా అద్భుతం.. ఎవరూ చేయలేని విధంగా వీరు చేస్తున్నారు. వీరిని ఎంతగా అభినందించిన తప్పు లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి రకరకాలుగా అడుక్కునే స్కిట్ పై కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ ఎక్కువగా వస్తున్న నేపద్యంలో ముందు ముందు మళ్ళీ కూడా అడుక్కునే స్కిట్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక స్కిట్ సక్సెస్ అయిందంటే దానికి కంటిన్యూషన్ జబర్దస్త్ లో లేదా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంటూనే ఉంటుంది. కనుక ఈ అడుక్కునే స్కిట్ కూడా తప్పకుండా కంటిన్యూ అవుతుందని బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.