Jabardasth Faima : ఫైమా బిగ్ బాస్ కు వెళ్తుందా… ఈ విషయంపై జబర్దస్త్‌ వాళ్లు ఏమన్నారంటే!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: August 28, 2022, 11:00 am

Jabardasth Faima : బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు సందడి మొదలు కాబోతుంది. సెప్టెంబర్ 4వ తారీకు నుండి బిగ్ బాస్ ను ప్రారంభించబోతున్నట్లుగా స్టార్ మా ప్రకటించింది. ఈ సారి కంటెస్టెంట్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్‌ గా ఉంది. సామాన్యులు ముగ్గురు ఈ సీజన్ లో సందడి చేయబోతున్నారు. వారు కాకుండా మరో 15 మంది సెలబ్రెటీలు ఎవరు అయ్యి ఉంటారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉదయ భాను పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఇంకా చాలా మంది పేర్లు కూడా ప్రముఖంగా మీడియాలో వినిపిస్తున్నాయి. అందులో జబర్దస్త్‌ ఫైమా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

జబర్దస్త్‌ ఫైమా కి మంచి పేరు ఉంది. ఆమె బుల్లెట్‌ భాస్కర్‌ టీమ్‌ లో మెయిన్‌ లీడ్ గా ఉంది. బుల్లెట్‌ భాస్కర్ స్థాయిలో ఆమె కి కూడా పారితోషికం ఉంటుంది. ఇక ఆమె చేస్తున్న సందడి నేపథ్యంలో ఇప్పటికే మల్లెమాల వారు ఆమెతో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ అగ్రిమెంట్‌ ప్రకారం ఫైమా ఇప్పట్లో ఈటీవీని వదిలి పోయే పరిస్థితి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె టీమ్‌ లీడర్ కాదు కనుక ఆమెతో మల్లెమాల వారు అగ్రిమెంట్‌ చేసుకోరు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి సోషల్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Jabardasth Faima going to Bigg Boss season 6 telugu

Jabardasth Faima going to Bigg Boss season 6 telugu

ఫైమా బిగ్ బాస్‌ కి వెళ్తుందా లేదా అనే విషయమై జబర్దస్త్‌ కమెడియన్స్ మాట్లాడారు. ఫైమా ఎందుకు బిగ్‌ బాస్ కి వెళ్తుంది.. ఆమె కి జబర్దస్త్‌ లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ప్రముఖంగా ఆమె కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఫైమా వెళ్లి బిగ్ బాస్‌ లో ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటూ కొందరు జబర్దస్త్‌ అభిమానులు కూడా అంటున్నారు. తెలుగు బిగ్‌ బాస్ లో ఒక వేళ ఫైమా ఎంట్రీ ఇస్తే మరో రేంజ్ లో ఎంటర్ టైన్‌మెంట్‌ ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైమా ఉందా లేదా అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp