Jabardasth Pandu : జబర్దస్త్ పండుకు అవమానం.. మల్లెమాల నుంచి అవుట్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 21, 2022, 9:00 pm

Jabardasth Pandu : ఢీ షో ద్వారా కంటెస్టెంట్, డ్యాన్సర్ పండు ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. కొన్ని ప్రైవేట్ సాంగులకు కొరియోగ్రఫీ కూడా చేసేశాడు. అయితే పండు మాత్రం డ్యాన్సర్‌గానే కాకుండా కమెడియన్‌గా కూడా ట్రై చేస్తుంటాడు. ఢీ, జబర్దస్త్, అదిరింది ఇలా అన్ని షోల్లోనూ కనిపించేవాడు. అసలు పండు ఇంతగా ఫేమస్ అవ్వడానికి లేడీ గెటప్. లేడీ గెటప్పులో నాదీ నక్కిలీసు అనే పాటకు వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి.

టిక్ టాక్ దుర్గారావు వేసిన స్టెప్పులను పండు తన స్టైల్లో వేయడంతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అలా అక్కడి నుంచి ఆ పాట, ఈ పండు, టిక్ టాక్ దుర్గారావుకు ఫుల్ క్రేజ్ వచ్చినట్టు అయింది. అయితే పండు మాత్రం ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా ఇలా అన్ని చోట్ల కనిపిస్తుంటాడు. ఆమధ్య నాగబాబుతో కలిసి అదిరింది షోకు వచ్చాడు. అది మూత పడ్డాక మళ్లీ ఈటీవీలోకి వెళ్లాడు.మొన్నటికి మొన్న జబర్దస్త్ షోలో కనిపించాడు. స్పెషల్ స్కిట్లు కూడా చేశాడు. అయితే ఇప్పుడు కామెడీ స్టార్స్‌కు వచ్చాడు.

Jabardasth Fame Pandu In Comedy Stars Dhamaka

Jabardasth Fame Pandu In Comedy Stars Dhamaka

తాజాగా వదిలిన ప్రోమోలో పండుకి జరిగిన అవమానం బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావ్ అని ఎక్స్‌ప్రెస్ హరి అడిగితే.. అక్కడి నుంచి వచ్చాను అంటాడు పండు. ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని అంటాడు. ఇక్కడ ఏదైనా చేద్దామని అంటాడు పండు.మరి ఇక్కడ కూడా తీసేస్తే ఎక్కడకు వెళ్తావ్ అని హరి అసలు విషయం చెప్పేశాడు. అంటే మల్లెమాల వాళ్లు పండుని తీసేశారన్న మాట. అక్కడ తీసేయడంతోనే ఇక్కడకు వచ్చాడనే ఉద్దేశ్యాన్ని హరి బయటపెట్టేశాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp