Jabardasth Avinash : నాగబాబుకే పాఠాలు చెబుతున్నాడా?.. అవినాష్ అతి మామూలుగా లేదు
Jabardasth Avinash : మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ బుల్లితెరపై బిజీ అవుతున్నాడు. కామెడీ స్టార్స్ ధమాకా అంటూ మార్పులు చేర్పులు చేయించాడు. మళ్లీ తన గ్యాంగును తీసుకొచ్చి రచ్చ చేస్తున్నాడు. అయితే నాగబాబు అండ్ టీం ఎంత కష్టపడ్డా కూడా టీఆర్పీలు మాత్రం అంతగా రావడం లేదు. పైగా శ్రీముఖిని తీసేసి.. ఆమెస్థానంలో దీపిక పిల్లిని పెట్టేశారు. మొత్తానికి ఏదో అలా సాగిపోతోంది.
ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో నాగబాబు స్వయంగా రంగంలోకి దిగి స్కిట్ వేశాడు. తన గ్యాంగును చితకబాదేశాడు. డిసిప్లేన్ ముఖ్యమంటూ అందరినీ చితకబాదేశాడు. ఇక ఒకరి మధ్య ఇంకొకరికి గొడవలు పెట్టేందుకు ప్రయత్నించారు. అందరూ ఒకరినొకరు కొట్టేసుకున్నారు. అయితే అవినాష్ మాత్రం నాగబాబుకే పాఠాలు చెప్పాడు. ఎలా నవ్వాలో, ఎలా జడ్జ్మెంట్ ఇవ్వాలో నేర్పించాడు.

Jabardasth Avinash Lesson To Naga Babu in Comedy Stars Dhamaka
Jabardasth Avinash : అవినాష్‌తో ఆడుకున్న నాగబాబు..
మొన్న రోబో స్కిట్ వేసినప్పుడు నాకు ఎందుకో నవ్వు రాలేదురా? అని అవినాష్‌ను నాగబాబు అంటాడు. మీకు కామెడీ మీద పట్టుంటే వస్తుంది అని సెటైర్ వేస్తాడు. ఇక నాగబాబు ముందే కాలు మీద పెట్టేస్తాడు. నేను జడ్జ్మెంట్‌లో ఎలాంటి మెలికలు నేర్చుకోవాలో చెప్పురా? అని నాగబాబు అడుగుతాడు. నేను స్కిట్ చేస్తుంటే అలా మీరు నవ్వుతూ ఉండాలి అని అంటాడు. దీంతో అవినాష్ పేగుల్ని మెలివేస్తాడు నాగబాబు.
