Rashmi Gautam : అనసూయ మాదిరిగా రష్మిని ఈటీవీ నుండి లాగేందుకు స్టార్‌ మా ప్లాన్ చేస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : అనసూయ మాదిరిగా రష్మిని ఈటీవీ నుండి లాగేందుకు స్టార్‌ మా ప్లాన్ చేస్తుందా?

Rashmi Gautam : ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ మరియు ఇతర కొన్ని కార్యక్రమాల వల్ల స్టార్ మా కి గట్టి పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. సీరియల్స్ విషయంలో స్టార్ మా ముందు ఈటీవీ చాలా తక్కువ అని చెప్పాలి. కనుక ఆ కార్యక్రమాలను డౌన్ చేస్తే కచ్చితంగా స్టార్ మా టాప్ లో నిలవడం మాత్రమే కాకుండా దరిదాపులో కూడా ఏ ఒక్క ఛానల్ ఉండదు. కనుక స్టార్ మా వారు ఈటీవీని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 October 2022,5:20 pm

Rashmi Gautam : ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ మరియు ఇతర కొన్ని కార్యక్రమాల వల్ల స్టార్ మా కి గట్టి పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. సీరియల్స్ విషయంలో స్టార్ మా ముందు ఈటీవీ చాలా తక్కువ అని చెప్పాలి. కనుక ఆ కార్యక్రమాలను డౌన్ చేస్తే కచ్చితంగా స్టార్ మా టాప్ లో నిలవడం మాత్రమే కాకుండా దరిదాపులో కూడా ఏ ఒక్క ఛానల్ ఉండదు. కనుక స్టార్ మా వారు ఈటీవీని తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఎవరో ఒకరు మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అందులో నిజం ఎంతో కానీ ఆ మధ్య అనసూయను ఈటీవీ నుండి లాగడంలో స్టార్ మా వారు సఫలమయ్యారు అంటూ కొందరు వాదిస్తూ ఉన్నారు. స్టార్ మా వారి ప్రమేయం లేకుండా అనసూయ జబర్దస్త్ నుండి వెళ్లి పోయిందంటూ కొందరు వాదిస్తూ ఉంటారు.

ఆ విషయం పక్కన పెడితే అనసూయ మాదిరిగానే స్టార్ మా వారు రష్మీ గౌతమ్ ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అనసూయ వెళ్ళి పోయిన తర్వాత జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్ కి కూడా రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క యాంకర్ పోస్ట్ కూడా రష్మి గౌతమ్ నిర్వహిస్తుంది. ఈటీవీలో అత్యంత కీలకమైన షోలకు ఆమె కీలకంగా ఉన్నది.. ఈ సమయంలో స్టార్ మా వారు ఆమెకు గాలం వేసి లాగేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంతుందో కానీ తాజాగా కొన్ని ఉదాహరణలు మాత్రం జనాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

jabardasth Rashmi Gautam in star maa tv programs

jabardasth Rashmi Gautam in star maa tv programs

అసలు విషయం ఏంటంటే ఇటీవల బిగ్ బాస్ స్టేజిపై రష్మీ గౌతమ్ డాన్స్ తో రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా స్టార్ మా వారు నిర్వహించిన ఒక అవార్డు కార్యక్రమంలో కూడా జబర్దస్త్ రష్మి గౌతమ్ సందడి చేసింది. కనుక మెల్ల మెల్లగా స్టార్ మా వారు రష్మి గౌతమ్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని వీటివికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో నిజం ఎంతుందో తెలియదు కానీ రష్మి గౌతమ్ ఎప్పటికీ ఈటీవీలో ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అప్పుడప్పుడు స్టార్మాకు ఇతర చానల్స్ కి వెళ్లడం తప్పేం కాదు కానీ ఈటీవీ ని పూర్తిగా వదలడం మాత్రం అస్సలు చేయవద్దు అంటూ ఆమె అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది