Rashmi Gautam : ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ మరియు ఇతర కొన్ని కార్యక్రమాల వల్ల స్టార్ మా కి గట్టి పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. సీరియల్స్ విషయంలో స్టార్ మా ముందు ఈటీవీ చాలా తక్కువ అని చెప్పాలి. కనుక ఆ కార్యక్రమాలను డౌన్ చేస్తే కచ్చితంగా స్టార్ మా టాప్ లో నిలవడం మాత్రమే కాకుండా దరిదాపులో కూడా ఏ ఒక్క ఛానల్ ఉండదు. కనుక స్టార్ మా వారు ఈటీవీని తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఎవరో ఒకరు మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అందులో నిజం ఎంతో కానీ ఆ మధ్య అనసూయను ఈటీవీ నుండి లాగడంలో స్టార్ మా వారు సఫలమయ్యారు అంటూ కొందరు వాదిస్తూ ఉన్నారు. స్టార్ మా వారి ప్రమేయం లేకుండా అనసూయ జబర్దస్త్ నుండి వెళ్లి పోయిందంటూ కొందరు వాదిస్తూ ఉంటారు.
ఆ విషయం పక్కన పెడితే అనసూయ మాదిరిగానే స్టార్ మా వారు రష్మీ గౌతమ్ ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అనసూయ వెళ్ళి పోయిన తర్వాత జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్ కి కూడా రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క యాంకర్ పోస్ట్ కూడా రష్మి గౌతమ్ నిర్వహిస్తుంది. ఈటీవీలో అత్యంత కీలకమైన షోలకు ఆమె కీలకంగా ఉన్నది.. ఈ సమయంలో స్టార్ మా వారు ఆమెకు గాలం వేసి లాగేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంతుందో కానీ తాజాగా కొన్ని ఉదాహరణలు మాత్రం జనాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
jabardasth Rashmi Gautam in star maa tv programs
అసలు విషయం ఏంటంటే ఇటీవల బిగ్ బాస్ స్టేజిపై రష్మీ గౌతమ్ డాన్స్ తో రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా స్టార్ మా వారు నిర్వహించిన ఒక అవార్డు కార్యక్రమంలో కూడా జబర్దస్త్ రష్మి గౌతమ్ సందడి చేసింది. కనుక మెల్ల మెల్లగా స్టార్ మా వారు రష్మి గౌతమ్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని వీటివికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో నిజం ఎంతుందో తెలియదు కానీ రష్మి గౌతమ్ ఎప్పటికీ ఈటీవీలో ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అప్పుడప్పుడు స్టార్మాకు ఇతర చానల్స్ కి వెళ్లడం తప్పేం కాదు కానీ ఈటీవీ ని పూర్తిగా వదలడం మాత్రం అస్సలు చేయవద్దు అంటూ ఆమె అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
This website uses cookies.