Hyper Aadi Remuneration for star maa tv bigg boss and parivar awards
Hyper Aadi : ఈటీవీలో కనిపించిన వారు స్టార్ మా లో కనిపించడం చాలా తక్కువ. కొద్ది మంది స్టార్స్ మాత్రమే అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా యాంకర్ సుమ, శ్రీముఖి మరో ఇద్దరు ముగ్గురు స్టార్స్ మాత్రం అక్కడ ఇక్కడ కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఈటీవీలో చేసేవారు ఒప్పందంలో ఉంటారు, కనుక స్టార్ మా లో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనకూడదు అనేది కండిషన్.. కానీ హైపర్ ఆది విషయంలో మాత్రం అది కాస్త పక్కకు పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈటీవీ కి హైపర్ ఆది అత్యంత కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లు రెండు కూడా ఆయన భుజస్కందాలపై నడుస్తున్నాయి.
కేవలం ఆయన ఉండడం వల్లే ఆ రెండు కార్యక్రమాలు నడుస్తున్నాయి అంటూ చాలా మంది అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి హైపర్ ఆది కి కాస్త స్వేచ్ఛను ఈటీవీ ఇచ్చిందని చెప్పాలి. ఆ స్వేచ్ఛ కారణంగానే మనోడు స్టార్ మా తో పాటు అప్పుడప్పుడు ఇతర చానల్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఇటీవల ప్రసారమైన స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమంలో హైపర్ ఆది సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ లో కూడా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో హైపర్ ఆది హడావుడి కనిపించింది. ఆది యొక్క ప్రజెంట్ తో బిగ్ బాస్ కి మంచి రేటింగ్ నమోదు అయ్యింది అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. హైపర్ ఆది పూర్తిగా ఈటీవీ కి చెందిన వాడు. అయినా కూడా స్టార్ మా లో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అంటే ఆయనకు ఏ స్థాయిలో స్టార్ మా వారు రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారు అర్థం చేసుకోవచ్చు.
Hyper Aadi Remuneration for star maa tv bigg boss and parivar awards
మాకు అందిన సమాచారం ప్రకారం పరివార్ అవార్డ్స్ మరియు బిగ్ బాస్ కోసం స్టార్ మా వారు ఏకంగా 10 లక్షల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ ని హైపర్ ఆదికి ఇచ్చి ఉంటారు. కాస్త అటు ఇటు అయినా హైపర్ ఆది ఈ స్థాయి పారితోషకం కు అర్హుడు అంటూ ఆయన అభిమానులు బలంగా వాదిస్తున్నారు. ఒక హీరో వస్తే ఏ రేంజ్ లో కార్యక్రమానికి మంచి బజ్ క్రియేట్ అవుతుందో అంతలా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కి బజ్ క్రియేట్ అయింది. అందుకే ఆయనకు ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చిన తప్పేం లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా ఈ విషయమే చర్చించుకుంటున్నారు. అంతకు మించి రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారని కొందరు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హైపర్ ఆదికి ఆ రెండు కార్యక్రమాలకు గాను స్టార్ మా వారు ఊహించనంత భారీ పారితోషికం ఇచ్చి ఉంటారనేది జనాల మాట.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.