Jabardasth Rocking Rakesh : జ‌బ‌ర్ధ‌స్త్ రాకింగ్ రాకేష్ ప్రేమ‌లో ప‌డ్డ జోర్దార్ సుజాత.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నార‌ట‌గా..!

Authored By Sam C | The Telugu News | Published on: February 23, 2022, 11:00 am

Jabardasth Rocking Rakesh : బుల్లితెర‌, వెండితెర న‌టీన‌టుల మ‌ధ్య ప్రేమ‌లు, పెళ్లిళ్లు స‌హ‌జం. అయితే ఈ ప్రేమ‌లు ఎప్పుడు పుడ‌తాయో, ఎప్పుడు బ్రేక‌ప్ అవుతాయో చెప్ప‌డం చాలా క‌ష్టం. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన జోర్దార్ సుజాత జీవితం బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో తర్వాత అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా సుజాత‌కు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అయితే బిగ్‌బాస్ తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. అప్పుడప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ వేదిక‌పై క‌నిపించిన ర‌చ్చ చేస్తున్న సుజాత ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడితో ఏడ‌డుగులు వేసేందుకు సిద్ధ‌మైంది.

ఇందుకు సంబంధించిన సాక్ష్యం కూడా దొరికింది.గ‌త కొద్ది రోజులుగా సుజాత‌- రాకేష్ ప్రేమ‌లో ఉన్న‌ట్ట‌గా ప‌లు స్కిట్స్ చేశారు. నిజానికి వీరిద్దరిది టిఆర్పి రేటింగ్ కోసం క్రియేట్ చేసిన ప్రేమ కాదని నిజంగానే ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా ఇద్దరి వ్యవహారం చూస్తే కనిపిస్తోంది. రీసెంట్ ఎపిసోడ్ లో రాకేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తనకు సుజాత అంటే ప్రాణం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. తన తల్లి తర్వాత తల్లి సుజాత అంటూ ఎమోషనల్ డైలాగ్ లు కొట్టాడు. దాంతో రాకేష్ లోని ఎమోషన్ స్పష్టంగా కనిపిస్తోంది.అంతేకాకుండా సుజాత కూడా తనకు తన తండ్రి అంటే ఇష్టం అని ఇప్పుడు రాకేష్ తన తండ్రి స్థానంలో ఉండి

Jabardasth Rocking Rakesh Jordar Sujatha in love

Jabardasth Rocking Rakesh Jordar Sujatha in love

Jabardasth Rocking Rakesh : ఒక్క‌టి కాబోతున్న ప్రేమ జంట‌..

ప్రేమను పంచుతాడని నమ్మకం ఉంది అంటూ కామెంట్ చేసింది. అందుకే అతని ప్రేమను ఆస్వాదిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.రాకేష్-సుజాతల జోడీ బావుంటుందని వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని మరో ఆర్టిస్ట్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు. వాళ్లిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. స్టేజ్‌పైన కూడా శ్రద్ధ చూపించుకుంటారు.. ఇద్దరు కలిసి జీవితం పంచుకుంటే బావుంటుంది అని బాబు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే వీళ్లిద్దరూ ఈ ఏడాదే పెళ్లిపీటలు ఎక్కనున్నారని అన్నాడు. అయితే ఈ విషయంపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp