Jordar Sujatha – Rocking Rakesh : మొగుడు రాకేష్ విషయం లో సుజాత ఊహించని కామెంట్స్ !

Advertisement

Jordar Sujatha – Rocking Rakesh : జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో రాకేష్ కూడా ఒకరు. టెలివిజన్ రంగంలో రాకేష్ మాదిరిగానే సుజాత కూడా మంచి గుర్తింపు సంపాదించింది. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో రాణించటం జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారటంతో కొన్ని నెలల క్రితం ఇద్దరు ఒకటవటం జరిగింది. ఇదిలా ఉంటే వీరిద్దరి పెళ్లి జరగటం వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. అప్పట్లో వీళ్ళ పెళ్లి వీడియో చూసి చాలామంది చాలా ఘనంగా జరిగింది అని కామెంట్లు చేయడం జరిగింది. కానీ లేటెస్ట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో

Advertisement
Jordar Sujatha Comments About Rocking Rakesh Details
Jordar Sujatha Comments About Rocking Rakesh Details

సుజాత మాట్లాడుతూ తన భర్త రాకింగ్ రాకేష్ ఒక చిన్న పిల్లోడు లాంటి వారిని సుజాత తెలిపింది. అయితే రాకేష్ నీ పెళ్లి చేసుకుంటున్నాను అని సహచరులతో చెప్పిన సమయంలో అతను ఒక కోపిష్టి అంటూ చెప్పుకొచ్చారు అని అన్నారు. అంత కోపంగా ఉండే వ్యక్తి నీకు ఓకేనా అంటూ మాట్లాడేవారు. ఇదే విషయాన్ని రాకేష్ కూడా నాతో చెప్పి నువ్వు నన్ను హ్యాండిల్ చేయగలవా అని ప్రశ్నించారు. కానీ రాకేష్ కోప్పడతాడని ఎప్పుడు అనిపించలేదు. రాకేష్ పై నాకు ఉన్నది ప్రేమో… ఇష్టమో తెలియదు. ఆయన కోపాన్ని నేను కోపం లాగా తీసుకోలేదని సుజాత తెలిపింది. ఆయన చేసే పని నేను చాలా దగ్గర నుంచి చూస్తాను. మా ఇద్దరిని దూరం చేయాలని మా పెళ్లి జరగకుండా

Advertisement

 Sujatha Comments About Rakesh Details, Rakesh, Sujatha, Rocking Rakesh, Jabardas-TeluguStop.com

చెడగొట్టాలని చాలామంది ప్రయత్నాలు చేశారని సుజాత తెలిపింది. ఎవరితో గొడవ జరిగినా నేను వాళ్లతో మాట్లాడతానని ఆమె చెప్పకు వచ్చారు. మా గురించి నెగిటివ్ చెప్పిన వాళ్ళు ఉన్నారని అలా చేసిన వాళ్లందరికీ… నేను షార్ప్ ఆన్సర్ ఇచ్చే దానిని… అంటూ సుజాత వెల్లడించింది. మీరు నాకు ఏం చెప్పొద్దు అని నేను రిప్లై ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.. నేనేంటో ఆయనకు తెలియదా అని సుజాత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు కెరియర్ పరంగా ఎవరికి వారు బిజీగా ఉంటూ మరోపక్క దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నారు.

Advertisement
Advertisement