Jabardasth Rocking Rakesh : రాకింగ్ రాకేష్‌కు నిశ్చితార్థం అయిందా?.. సుజాత మాటలకు అర్థమదేనా?

 Authored By prabhas | The Telugu News | Updated on :18 June 2022,2:30 pm

Jabardasth Rocking Rakesh : జబర్దస్త్ షోలో నడిచేవన్నీ వినోదం కోసమే. అందులో నిజాలు ఉంటాయనుకోవడం కాస్త కష్టమే. వాళ్లేం చేసినా కూడా జనాలను ఎంటర్టైన్ చేయడం కోసమే చేస్తుంటారు. అలా ఒక్కోసారి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌‌లకు తేడా లేకుండా చేసేస్తుంటారు. అప్పుడు అందరికీ అనుమానం వస్తుంటుంది. ఆఫ్ స్క్రీన్‌లో కూడా అదే చనువు, రొమాన్స్ చేస్తుంటే మాత్రం అందరికీ ఓ ముద్ర పడిపోతుంది.ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుమానపడుతుంటారు. వాటి గురించి చర్చలు పెడుతుంటారు. అలా రష్మీ సుధీర్, వర్ష ఇమాన్యుయేల్ జోడిలు బాగానే ఫేమస్ అయ్యాయి. అయితే వీరు ఆన్ స్క్రీన్‌లోనే రెచ్చిపోతుంటారు. ఆఫ్ స్క్రీన్‌లో అంతగా కనిపించరు.

కానీ సుజాత రాకేష్ మాత్రం ఆఫ్ స్క్రీన్‌లో కూడా రెచ్చిపోతోంటారు.ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తుంటారు. గోవాలో సందడి చేస్తుంటారు. బర్త్ డే పార్టీలు చేసుకుంటారు. అలా పర్సనల్‌గా కలిసి తిరుగుతుంటారు. కాస్ట్ లీ బహుమతులు ఇచ్చుకుంటారు. అలా ఈ ఇద్దరి మధ్య ఏదో ఒకటి నడుస్తోందని అందరూ నమ్ముతుంటారు. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసేసుకుంటారనే టాక్ బాగా ఎక్కువైంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఇంద్రజ బయటకు రప్పించేందుకు ప్రయత్నించింది. ఇంద్రజ కొన్ని ప్రశ్నలను అడిగింది.

Jabardasth Rocking Rakesh And Jordar Sujatha Got Engaged

Jabardasth Rocking Rakesh And Jordar Sujatha Got Engaged

అందులో రాకేష్‌ను తన నిశ్చితార్థం గురించి అడిగింది. ఎందుకు అంత సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చింది? అని రాకేష్‌ను ఇంద్రజ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా రాకేష్ వింతగా స్పందించింది. అసలు అది నిశ్చితార్థం అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే జరగలేదు కాబట్టి అని అంటాడు. ఇంతలో సుజాత ఊపుకుంటూ వస్తుంది. ఏంటి అది నిజం కాదని అంటున్నావా? అని సుజాత రొమాంటిక్‌గా అడగడంతో మనోడు తెగ సిగ్గు పడిపోతుంటాడు. మొత్తానికి అసలు మ్యాటర్ ఏంటన్నది మాత్రం రివీల్ చేయలేదు. నిశ్చితార్థం జరిగిందా? లేదా? అనేది క్లారిటీ ఇవ్వలేదు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి