Jabardasth Saddam : జబర్దస్త్‌ లో సద్దాం టీమ్‌ మూడు నాళ్ల ముచ్చటేనా.. వాళ్ల టీమ్ పై విమర్శలు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 8, 2023, 1:20 pm

Jabardasth Saddam ; జబర్దస్త్‌ నుండి హైపర్‌ ఆది తప్పుకున్నాడు. గతంలో ఒకసారి ఆది తప్పుకుని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సారి మాత్రం ఆయన రావడం లేదని తేలిపోయింది. ఆది స్థానంలో సద్దాం టీమ్‌ ను మల్లెమాల వారు తీసుకు వచ్చారు. గతంలో పటాస్ కార్యక్రమంతో సందడి చేసిన సద్దాం మరియు యాదమరాజు లను జబర్దస్త్‌ లోకి తీసుకు రావడంతో కచ్చితంగా మంచి రేటింగ్‌ వస్తుందని అంతా అనుకున్నారు. ఆ మధ్య వీరిద్దరు ఇతర ఛానల్స్ లో సందడి చేశారు. అయినా కూడా వీరికి ఈటీవీ ఛాన్స్ ఇచ్చింది.

ఈటీవీలో టెలికాస్ట్‌ అవుతున్న జబర్దస్త్‌ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాల్లో కూడా సద్దాం అండ్ టీమ్‌ సందడి చేస్తున్నారు. అయితే వీరు వచ్చి నెల రోజుల్లోనే అప్పుడే వీరి టీమ్‌ ను తొలగించే అవకాశాలు ఉన్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాబోయే రెండు వారాల్లో సద్దాం టీమ్‌ ను మనం చూడక పోవచ్చు అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం జబర్దస్త్‌ లో ఉన్న టీమ్స్ తో పోల్చితే సద్దాం టీమ్‌ చాలా ఉత్తమమైన ప్రదర్శణ చేస్తున్నారు.

jabardasth saddam team may be going to out very soon

jabardasth saddam team may be going to out very soon

సద్దాం కొన్ని కారణాలతో మల్లెమాల వారిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరు ఏడాది పాటు ఒప్పందం చేసుకోలేదు అని.. అందుకే వీరికి కచ్చితంగా జబర్దస్త్‌ లో ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు అంటున్నారు. అయితే బుల్లి తెర మరియు వెండి తెర వర్గాల వారు చెబుతున్న దాని ప్రకారం సద్దాం ముందు ముందు సినిమాల్లో బిజీ అవ్వాలి అనుకుంటున్నాడు. అందుకే జబర్దస్త్‌ షో లో ఆయన పూర్తి స్థాయిలో ఉండేందుకు ఆసక్తిగా లేడు. ఆ కారణంగానే ఒప్పందం చేసుకోలేదు అంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp